తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారిని గల్ఫ్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్ మరియు తెలుగు సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు ఇటీవల కలిశారు.
ఈ సందర్భంగా ఆయన తిరుపతి విమానాశ్రయాన్ని పూర్తిగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి, కువైట్ సహా ఇతర గల్ఫ్ దేశాలనుండి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు. అలాగే విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచీ కూడా గల్ఫ్ దేశాలకు డైరెక్ట్ విమానాలు రావాలని కోరారు.
ఈ విషయంపై నారా లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, శ్రీనివాస్ గారు సానుకూలంగా స్పందించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారు త్వరలోనే కువైట్ నుండి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభిస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రస్తుతం కువైట్ నుండి ఇండియాకు విమాన సీట్లు 12,000 నుంచి 18,000కు పెంచినట్లు చెప్పారు. అలాగే వివిధ ఎయిర్ లైన్‌లతో చర్చలు కూడా జరిగాయని తెలిపారు.
తక్షణమే స్పందించి సహకరించిన మంత్రులకు సుధాకర రావు గారు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కువైట్‌లో తెలుగుదేశం పార్టీ తరఫున జరుగుతున్న కార్యక్రమాలను మంత్రి లోకేష్ గారికి వివరించారు.