ఈయన వ్యతిరేక చర్యలు ఆ పార్టీ నాయకులు మాటల్లోనే స్పష్టమవుతున్నాయి.
రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాలలో ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులకు కొంతమందిని వేరొక నియోజకవర్గంకు మార్పు చేస్తూ మరికొంతమంది ఎమ్మెల్యేలకు ఊస్టింగ్ చెప్తున్నారు.
పార్టీలో ఇదే సంక్షోభానికి దారి తీసింది.
ఈయన సొంత సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు వేరొక నియోజకవర్గంలో సీట్లు ఇస్తూ ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు సీట్లు లేవని చెబుతున్నారు.
రాష్ట్రంలో వైసిపి పాలనలో దళితులకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలు ప్రతిరోజు చెబుతూనే ఉన్నాయి.
ఇప్పుడు అధికార వైసిపి పార్టీలో దళిత నాయకులే పార్టీలో దళితులకు ఉన్న గౌరవం ఏమిటో బహిర్గతం చేస్తున్నారు.
ఐప్యాక్ సర్వేలో ఓటమిపాలయ్యే అభ్యర్థుల జాబితా ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని ఈయన చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్సీ బీసీ వర్గాలకు సీట్లు కేటాయింపు విషయములో అన్యాయం జరుగుతుందని ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం లో ఎంఎస్ బాబు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం దళితులను ఏ విధంగా చూస్తుంది అన్న విషయాన్ని స్పష్టం చేశారు.
దళితులలో సీనియర్ నాయకుడుగా గుర్తింపు పొందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ పరిస్థితి పార్టీలో ఆగమ్య గోచరంగా మారింది.
జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఒక్కసారి అవకాశం ఇప్పించమని ఎంతోమంది సీనియర్ నాయకులు కాళ్లు వీళ్లు పట్టుకున్న ఈయన దర్శన భాగ్యం దొరకడం లేదని మాణిక్య వరప్రసాద్ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ జిల్లాలో వైసిపి ఎమ్మెల్సీ వంశీ, దాడి వీరభద్రరావు వంటి బీసీ నేతలు కూడా వైసిపి పార్టీలో బీసీలకు ఉన్న గౌరవం ఏమిటో చెప్పి పార్టీకి రాజీనామాలు చేశారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కానీ ఈయన కి తనపై మంచి అభిప్రాయం లేదంటూ బహిర్గతంగానే ప్రకటించారు.
ఈయన పాలన ప్రారంభంలో మూడు రాజధానులు అంటూ ప్రారంభించిన మూడు మొక్కలాట నేడు ఈయన మెడకు చుట్టుకుంటుంది.
వైసిపి పార్టీ కూడా మూడు ముక్కలుగా 2024 ఎన్నికల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
కాంగ్రెస్ పార్టీని ముంచి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను తీసుకొని అధికారం చేయెక్కించుకున్న ఈయన కి కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టేదిశగా అడుగులు వేస్తుంది.
ఇప్పటికే తెలుగుదేశం జనసేన కూటమితో కెరిబిక్కిరి అవుతున్న జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను పార్టీలో చేర్చుకొని జగన్ పై బాణం ఎక్కుపెడుతుంది.
ఈ పరిస్థితులలో అధికార వైసిపి వ్యతిరేక ఓటు పూర్తిగా టిడిపి జనసేన కూటమికి బదిలీ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓట్ బ్యాంకులో నిట్ట నిలువుగా చీలిక వచ్చి కాంగ్రెస్ వైసిపి పార్టీలు పంచుకుంటాయి.
ఈ పరిస్థితులలో ఈయన ప్రభుత్వం పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఉంది.
టిడిపి జనసేన కూటమిని ఈయన తన వద్ద ఉన్న అక్రమ సంపాదనతో ఎదుర్కోవచ్చు నన్న ఈయన ఆశలపై కాంగ్రెస్ పార్టీ నీళ్లు చల్లిందని చెప్పవచ్చు.
రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి ఓటుకు 5 నుండి 10000 రూపాయలు ఇచ్చిన విజయం అన్నది కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదు.
దేశంలో డబ్బుతో వ్యాపారాలు చేసే వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకున్న పారిశ్రామికవేత్తలను చూసాము.
డబ్బుతో రాజ్యాధికారాన్ని సాధించుకుని అధికార అడ్డుపెట్టుకుని పది రెట్లు డబ్బు సంపాదించవచ్చునన్న ఈయన పాలనతో రాష్ట్రంలో ప్రజలు విసుగెత్తిపోయారు.
మళ్లీ ఈయన అధికారం ఇస్తే దేశంలో రాజకీయ పార్టీలు మాయం అయిపోయి పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చే ప్రమాదముంది.
ఈ పరిస్థితి ఏర్పడితే బ్రిటిష్ పాలనను మించి దేశ సంపద వారి చేతుల్లోకి వెళ్లి ప్రజలు బానిస బతుకులు బతికే పరిస్థితి ఏర్పడుతుంది.
ఈయన కి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఓట్ బ్యాంకుకు తన వద్ద ఉన్న ధన బలంతో ఏదైనా చేయవచ్చుదన్న అహంకారానికి ఈ ఐదేళ్ల పాలన ఉదాహరణగా చెప్పవచ్చు.
డబ్బుతో ఏదైనా చేయవచ్చునని ఈయన అహంకార ధోరణి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది.
ఈ పరిస్థితి గ్రహించిన రాష్ట్ర ప్రజలు ఈయన ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉండగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే రీతిలో వ్యూహాలు రచిస్తున్నాయి.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి