LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

OTTReleases: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు ఇవే.. లిస్ట్ చూడండి!

OTTReleases: ఈ వారాంతం వినోదానికి సిద్ధమా? తెలుగు మ్యూజికల్ డ్రామా 'నిలవే' నుంచి తమిళ కామెడీ థ్రిల్లర్ 'కాకీ సర్కస్' వరకు.. ఈ వారం ఓటీటీలో విడుదలైన టాప్ సినిమాలు, స్ట్రీమింగ్ వివరాలు మీకోసం.

AndhraPravasi News Desk 2 min read
OTTReleases: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు ఇవే.. లిస్ట్ చూడండి!

OTTReleases: వేసవి తాపం పెరుగుతున్న వేళ, ఇంటి పట్టునే ఉండి వినోదాన్ని ఆస్వాదించాలనుకునే సినీ ప్రియుల కోసం ఈ వారాంతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సిద్ధమయ్యాయి. కేవలం తెలుగు చిత్రాలే కాకుండా, పక్క రాష్ట్రాలైన తమిళ, మలయాళ భాషల నుంచి కూడా అద్భుతమైన సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ప్రేమ కథలు, ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ థ్రిల్లర్స్ ఇలా అన్ని రకాల జోనర్లలో ఈ వారం సందడి నెలకొంది. ఈ వీకెండ్ మీరు మిస్ అవ్వకూడదని కొన్ని ప్రత్యేక చిత్రాల విశేషాలు మీకోసం…

మొదటగా తెలుగు ప్రేక్షకుల కోసం నిలవే' అనే మ్యూజికల్ లవ్ స్టోరీ 'ఈటీవీ విన్' (ETV Win) లో అందుబాటులోకి వచ్చింది. అర్జున్ అనే ఒక అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ చుట్టూ తిరిగే ఈ కథ, ప్రేమ కోసం అతను పడే తపనను ఆవిష్కరిస్తుంది. అతనికి అతిథి అనే అమ్మాయి పరిచయమైన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మలుపులు తిరిగాయి? ఆమె ఎందుకు వెనకడుగు వేసింది? అనే అంశాలను దర్శకుడు చాలా హృద్యంగా తెరకెక్కించారు. పాటలు, ఎమోషన్స్ ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్.

ఇక గ్రామీణ నేపథ్యం ఉన్న కథలను ఇష్టపడే వారి కోసం తాయ్ కిళవి అనే తమిళ చిత్రం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ఇందులో పవనుత్తాయి అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. ఊరిలో వడ్డీ వ్యాపారం చేస్తూ అందరినీ గడగడలాడించే ఒక బామ్మ కథ ఇది. కామెడీతో పాటు సాగే ఈ రూరల్ డ్రామా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. వారాంతంలో సరదాగా నవ్వుకోవడానికి ఈ సినిమా చక్కగా సరిపోతుంది.

థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి కాకీ సర్కస్' ఒక క్రేజీ ఆప్షన్. ఒక దొంగ ఏకంగా జైలులోకి దూరి అక్కడ ఉన్న హుండీని దొంగిలించడానికి ప్లాన్ వేయడం ఈ సినిమా ప్రత్యేకత. పోలీసులు, దొంగల మధ్య సాగే ఈ పిల్లి-ఎలుక ఆట జీ5  లో చూడొచ్చు. మరోవైపు, మలయాళం నుంచి వచ్చిన హాల్'  అనే సినిమా సంగీత ప్రియులను అలరిస్తోంది. షేన్ నిగమ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో విభిన్న మతాలకు చెందిన ప్రేమికులు తమ ప్రేమ కోసం సమాజంతో ఎలా పోరాడారనేది చూపించారు.

హారర్ సినిమాలంటే ఇష్టపడే వారికోసం మలయాళ చిత్రం కనిమంగళం కోవిలకం  కూడా సిద్ధంగా ఉంది. ముగ్గురు హాస్టల్ విద్యార్థులు తమ చుట్టూ జరుగుతున్న వింత పరిణామాలను ఎలా ఎదుర్కొన్నారనేది ఇందులో హాస్యంతో జోడించి చెప్పారు. ఇవే కాకుండా తోబుట్టువుల మధ్య ఉండే అనుబంధాన్ని చాటి చెప్పే 'నాంగళ్' అనే ఫ్యామిలీ డ్రామా కూడా సన్ నెక్స్ట్ (Sun NXT) లో స్ట్రీమ్ అవుతోంది. ఇలా ఈ వారం మొత్తం ఓటీటీ ప్రపంచం ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తోంది. కాబట్టి మీ పనులన్నీ పక్కన పెట్టి, ఒక బకెట్ పాప్‌కార్న్ సిద్ధం చేసుకుని ఈ వీకెండ్ ఎంజాయ్ చేసేయండి…

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…