Pondali Panchabharthaka: 'పొందాలి పంచభర్తక' మూవీ రివ్యూ & విశేషాలు... ట్విస్టులే ట్విస్టులు!

Pondali Panchabharthaka: డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, వెంకట్ దుగ్గిరెడ్డి, పవన్ పూసర్ల ప్రధాన పాత్రల్లో గంగా సప్తశిఖర దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పొందాలి పంచభర్తక'. విదేశీ యువతి మరణం మరియు అండర్ వరల్డ్ డాన్ చుట్టూ తిరిగే ఈ క్రైమ్ కామెడీ మిస్టరీ చిత్రం ఆగస్టు 14న విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

'పొందాలి పంచభర్తక' మూవీ రివ్యూ & విశేషాలు
'పొందాలి పంచభర్తక' మూవీ రివ్యూ & విశేషాలు
  • లెస్ లాజిక్.. మోర్ మ్యాజిక్: ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తున్న 'పొందాలి పంచభర్తక'

  • విదేశీ యువతి మరణం.. అండర్ వరల్డ్ డాన్ సస్పెన్స్: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఫన్ రైడ్!

Pondali Panchabharthaka: నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో, గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త క్రైమ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ 'పొందాలి పంచభర్తక'. రాయల్ క్రౌన్ ప్రొడక్షన్స్ మరియు ఓం సాయిరామ్ ఆర్ట్స్ బ్యానర్లపై వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ పవన్, శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మన్యం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఈ సినిమాలో డాక్టర్ రాజేంద్రప్రసాద్‌తో పాటు పృథ్వీరాజ్ (30 ఇయర్స్ ఇండస్ట్రీ), రోల్ రైడా, జెమిని సురేష్, శ్రీకాంత్ అయ్యంగార్, షరీఫ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. అట్లాంటాకు చెందిన నటులు వెంకట్ దుగ్గిరెడ్డి, పవన్ పూసర్ల ప్రధాన పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇప్పటికే దాదాపు 12 చిత్రాలలో నటించిన వెంకట్ దుగ్గిరెడ్డి తనదైన నెల్లూరు యాస, టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించగా, టాలీవుడ్‌కు పరిచయమైన పవన్ పూసర్ల తొలి సినిమాతోనే మంచి ప్రతిభ కనబరిచారు.

కథాంశం విషయానికి వస్తే.. నలుగురు సాధారణ వ్యక్తులు అనుకోకుండా ఒక విదేశీ యువతి అనుమానాస్పద మరణం చుట్టూ ఏర్పడిన చిక్కుల్లో పడతారు. ఆ యువతికి అంతర్జాతీయ అండర్ వరల్డ్ డాన్‌తో సంబంధం ఉండటంతో వారి సమస్యలు మరింత జటిలమవుతాయి. ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి వారు చేసే హాస్యభరిత ప్రయత్నాలు సినిమాను చివరివరకు ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తాయి.

'బంతిపువ్వు బాల్‌రాజ్', 'పిడుగు పుష్పరాజ్', 'బేబీ స్టార్ బాలాజీ' వంటి ఫన్నీ పాత్రల పేర్లు మరియు 'లెస్ లాజిక్.. మోర్ మ్యాజిక్' అనే వినోదాత్మక కాన్సెప్ట్‌తో సినిమా ఆద్యంతం హిలేరియస్‌గా సాగుతుంది. ఈ చిత్రానికి మహేష్ నారాయణ సంగీతం అందించగా, జానీ బాషా ఎడిటర్‌గా, కేవీ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా సాంకేతిక విభాగాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. అట్లాంటా జానపద జనార్ధన్ పాడిన టైటిల్ సాంగ్‌తో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మర్డర్ మిస్టరీలో అసలైన అండర్ వరల్డ్ డాన్ ఎవరనే సస్పెన్స్‌ను చివరివరకు ఆసక్తికరంగా కొనసాగించడంతో పాటు చక్కటి వినోదాన్ని జోడించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది.

Tags

Be the first to react

Latest