LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

LIK: అంచనాలను అందుకోలేకపోయిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. కానీ టాప్ 5 లో..

Love Insurance Kompany (LIK): తమిళ సినీ ప్రేక్షకులలో మంచి అంచనాలతో విడుదలైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రదీప్ రంగనాథన్, ఎస్.జే. సూర్య, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రారంభంలో మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత అ…

AndhraPravasi News Desk 2 min read
LIK: అంచనాలను అందుకోలేకపోయిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ..  కానీ టాప్ 5 లో..

ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ..

2026లో విడుదలైన సినిమా లలో నాల్గవ స్థానంలో..

తమిళ సినీ ప్రేక్షకులలో మంచి అంచనాలతో విడుదలైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రదీప్ రంగనాథన్, ఎస్.జే. సూర్య, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రారంభంలో మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత అదే ఉత్సాహాన్ని కొనసాగించలేకపోయింది.

ప్రదీప్ రంగనాథన్ వరుసగా మూడు హిట్ సినిమాల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలైన తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధారణ స్థాయిలోనే వసూళ్లు సాధిస్తోంది. అయినప్పటికీ, 2026 సంవత్సరంలో నాల్గవ అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలవడం విశేషం.

ఈ సై-ఫై రొమాంటిక్ కామెడీ చిత్రం మొదటి వారంలో రూ. 33.22 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో వారం ప్రారంభం మాత్రం ఆదాయం తగ్గింది. 8వ రోజు (రెండో శుక్రవారం) రూ. 96 లక్షలు మాత్రమే రాబట్టగా, 9వ రోజు శనివారం రూ. 1.68 కోట్లను సొంతం చేసుకుంది. మొత్తం 9 రోజుల్లో ఈ చిత్రం రూ. 35.86 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసింది. గ్రాస్ కలెక్షన్ రూ. 42.31 కోట్లుగా ఉంది.

వారం వారీగా వసూళ్లు:
మొదటి వారం – రూ. 33.22 కోట్లు
8వ రోజు – రూ. 0.96 కోట్లు
9వ రోజు – రూ. 1.68 కోట్లు
మొత్తం – రూ. 35.86 కోట్లు

ఈ వసూళ్లతో, రూ. 30.72 కోట్ల వసూళ్లు సాధించిన “విత్ లవ్” చిత్రాన్ని అధిగమించి, ఈ సినిమా 2026లో నాల్గవ స్థానంలో నిలిచింది. అయితే మూడో స్థానంలో ఉన్న “యూత్” (రూ. 52.18 కోట్లు) వసూళ్లను అధిగమించే అవకాశాలు కనిపించడం లేదు.

2026లో టాప్ తమిళ సినిమాలు (ఇండియా నెట్):
తాయ్  కెలవి – రూ. 62.46 కోట్లు
పరాశక్తి – రూ. 52.46 కోట్లు
యూత్ – రూ. 52.18 కోట్లు
లవ్ ఇన్షూరెన్స్ కంపెనీ – రూ. 35.86 కోట్లు
విత్ లవ్ – రూ. 30.72 కోట్లు

ఈ చిత్రాన్ని విఘ్నేశ్ శివన్ రచించి, దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి నయనతార మరియు ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించారు. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై ఈ చిత్రం రూపొందింది. ఇందులో సీమన్, యోగి బాబు, గౌరీ జి కిషన్, షా రా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రెడ్ జయింట్ మూవీస్ ఈ సినిమాను విడుదల చేసింది. ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. భారీ అంచనాల మధ్య వచ్చిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, టాప్ 5లో చోటు సంపాదించడం ద్వారా తన స్థాయిని నిలబెట్టుకుంది.

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…