ఇళయరాజా పై సుప్రీం కోర్టు సీరియస్!
Ilaiyaraaja Copyright Case: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ‘మూడు పాని’ చిత్రంలోని ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాట రీక్రియేషన్‌కు సంబంధించిన కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఇళయరాజా దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు స్వీకరించలేదు.
- ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాట కాపీరైట్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.
- ఇళయరాజా దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Ilaiyaraaja Copyright Case: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ‘మూడు పాని’ చిత్రంలోని ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాట రీక్రియేషన్‌కు సంబంధించిన కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఇళయరాజా దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు స్వీకరించలేదు.
ట్యూన్‌పై హక్కు.. ఇతర హక్కులపై స్పష్టత
పాటకు సంబంధించిన హక్కుల విషయంలో ఇళయరాజా వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. పాటలోని ట్యూన్‌పై ఇళయరాజాకు హక్కులు ఉన్నప్పటికీ.. సాహిత్యం, సౌండ్ రికార్డింగ్‌పై కాపీరైట్ హక్కులు ఆయనకు ఉండవని స్పష్టం చేసింది.
ఈ కేసులో నిర్మాత నుంచి సంబంధిత హక్కులను పొందిన సరిగమ మ్యూజిక్ లేబుల్ కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది.
‘మూడు పాని’ పాట రీక్రియేషన్‌పై వివాదం
1980లో విడుదలైన ‘మూడు పాని’ సినిమాలోని ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాటను ఇటీవల ‘అఘతియా’ సినిమాలో రీక్రియేట్ చేశారు. అయితే తన అనుమతి లేకుండా పాటను రీక్రియేట్ చేశారంటూ ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆయన కోర్టును ఆశ్రయించారు.
మరోవైపు, తాము కాపీరైట్ హక్కులు పొందిన చిత్రాల్లోని పాటలపై ఇళయరాజా హక్కులు కోరుతున్నారని, వాటిని వాణిజ్యపరంగా వినియోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని సరిగమ మ్యూజిక్ లేబుల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇళయరాజా
ఈ వివాదంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఇళయరాజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునే కారణం లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఆయన అప్పీల్‌కు చుక్కెదురైంది.
‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాట రీక్రియేషన్‌కు సంబంధించిన ఈ వివాదంలో సరిగమ మ్యూజిక్ లేబుల్‌కు అనుకూలంగా గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగనున్నాయి.
Tags
Be the first to react