యాపిల్‌లో లేఆఫ్స్ కలకలం...రెండు నెలల్లో రెండోసారి!

Apple Layoffs Again: ప్రముఖ టెక్ సంస్థ యాపిల్‌లో మరోసారి ఉద్యోగాల కోతలు జరిగినట్లు సమాచారం. రెండు నెలల వ్యవధిలోనే కంపెనీ రెండోసారి లేఆఫ్స్ చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తాజాగా యాపిల్‌కు చెందిన ఫిట్‌నెస్+ (Fitness+) విభాగంలో పలువురు ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.

Apple Layoffs
Apple Layoffs
  • రెండు నెలల వ్యవధిలోనే రెండోసారి లేఆఫ్స్ చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
  • ఫిట్‌నెస్+ సేవలకు సంబంధించిన విభాగాల్లో కూడా సంస్థ మార్పులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Apple Layoffs Again: ప్రముఖ టెక్ సంస్థ యాపిల్‌లో మరోసారి ఉద్యోగాల కోతలు జరిగినట్లు సమాచారం. రెండు నెలల వ్యవధిలోనే కంపెనీ రెండోసారి లేఆఫ్స్ చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తాజాగా యాపిల్‌కు చెందిన ఫిట్‌నెస్+ (Fitness+) విభాగంలో పలువురు ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.

గత వారంలోనే ఈ తొలగింపులు జరిగినట్లు సమాచారం. తాజా లేఆఫ్స్‌లో ముఖ్యంగా ఫిట్‌నెస్+ ఆడియో విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. అయితే మొత్తం ఎంతమందిని తొలగించారనే విషయంపై స్పష్టమైన సమాచారం వెలువడలేదు.

ఇదిలా ఉండగా.. యాపిల్ సంస్థ గత ఆగస్టులో కూడా ఉద్యోగులపై కోత విధించినట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

తాజా లేఆఫ్స్‌తో రెండు నెలల వ్యవధిలోనే యాపిల్‌లో రెండుసార్లు ఉద్యోగాల కోతలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తన వివిధ విభాగాల్లో కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.

Tags

Be the first to react

Latest