Tirumala: తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం!
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గినప్పటికీ, ఆలయంలో భక్తుల రాకపోకలు కొనసాగుతున్నాయి. జూలై 6వ తేదీ ఉదయం పరిస్థితి ప్రకారం, ఉచిత సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
తిరుమల హుండీ ఆదాయం ₹5.05 కోట్లు – 88 వేల మందికి పైగా భక్తుల దర్శనం..
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గినా దర్శనానికి కొనసాగుతున్న వేచి సమయం..
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గినప్పటికీ, ఆలయంలో భక్తుల రాకపోకలు కొనసాగుతున్నాయి. జూలై 6వ తేదీ ఉదయం పరిస్థితి ప్రకారం, ఉచిత సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు సుమారు 8 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 2 నుంచి 4 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అలాగే సర్వదర్శన టోకెన్ పొందిన భక్తులు 3 నుంచి 5 గంటల్లో స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.
ఆదివారం తిరుమల శ్రీవారిని మొత్తం 88,412 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,273 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండీకి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించగా, ఒకే రోజు రూ.5.05 కోట్ల ఆదాయం లభించింది.
అలాగే నిన్న మొత్తం 4.24 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.55 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆరోగ్య సేవల్లో భాగంగా 3,001 మంది భక్తులకు వైద్య చికిత్స అందించినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తుల రద్దీ గతంతో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ, తిరుమలలో దర్శనం కోసం వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Tags
Be the first to react