Dhurandhar: ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల! అంతర్జాతీయ వేదికపై మరో ఘనత.. Samantha: పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు.. భర్త రాజ్ నిడిమోరు, అభిమానుల సమక్షంలో సమంత వేడుకలు.! Tolywood: పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను! ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే..! Duvvada Madhuri: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం! స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా.. Darling movie: రీ-రిలీజ్‌లోనూ ప్రభాస్ ప్రభంజనం.. 3 రోజుల్లోనే రూ. 10 కోట్ల మార్కును దాటేసిన 'డార్లింగ్'! Rajamouli: మాహిష్మతికి పునాది అక్కడే పడింది.. చిచెన్ ఇట్జా పిరమిడ్ స్ఫూర్తిని వెల్లడించిన జక్కన్న.. Tollywood: ఒకవైపు కేసు.. మరోవైపు అషు రెడ్డి వార్నింగ్.. అసలేం జరిగింది? Akshay Kumar: భయపడని నిటార.. కటకటాల్లోకి నిందితుడు! స్టార్ కిడ్ మనోధైర్యాన్ని మెచ్చుకున్న పోలీసులు.. Rajamouli: వారణాసి మేకింగ్ చూసి ఫిదా అయిన జక్కన్న - చిత్ర బృందంపై ప్రశంసల జల్లు! Agadha: 45 నిమిషాల వీఎఫ్ఎక్స్ హంగులతో.. విజువల్ వండర్‌గా రాబోతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్.. Dhurandhar: ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల! అంతర్జాతీయ వేదికపై మరో ఘనత.. Samantha: పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు.. భర్త రాజ్ నిడిమోరు, అభిమానుల సమక్షంలో సమంత వేడుకలు.! Tolywood: పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను! ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే..! Duvvada Madhuri: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం! స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా.. Darling movie: రీ-రిలీజ్‌లోనూ ప్రభాస్ ప్రభంజనం.. 3 రోజుల్లోనే రూ. 10 కోట్ల మార్కును దాటేసిన 'డార్లింగ్'! Rajamouli: మాహిష్మతికి పునాది అక్కడే పడింది.. చిచెన్ ఇట్జా పిరమిడ్ స్ఫూర్తిని వెల్లడించిన జక్కన్న.. Tollywood: ఒకవైపు కేసు.. మరోవైపు అషు రెడ్డి వార్నింగ్.. అసలేం జరిగింది? Akshay Kumar: భయపడని నిటార.. కటకటాల్లోకి నిందితుడు! స్టార్ కిడ్ మనోధైర్యాన్ని మెచ్చుకున్న పోలీసులు.. Rajamouli: వారణాసి మేకింగ్ చూసి ఫిదా అయిన జక్కన్న - చిత్ర బృందంపై ప్రశంసల జల్లు! Agadha: 45 నిమిషాల వీఎఫ్ఎక్స్ హంగులతో.. విజువల్ వండర్‌గా రాబోతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్..

Sekhar Kammula upcoming Movie: జెన్-జీ యువత టార్గెట్‌గా శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ.. సీక్వెల్‌పై జోరుగా ప్రచారం!

Sekhar Kammula upcoming Movie: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీ డేస్ 2’ కి రంగం సిద్ధమవుతోంది. నేటి తరం యువత కాలేజ్ జీవితం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా విశేషాలు తాజా అప్‌డేట్స్..

Published : 2026-03-04 16:04:00

Sekhar Kammula upcoming Movie: తెలుగు సినీ ఇండస్ట్రీలో  తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు శేఖర్ కమ్ముల. భారీ హంగులు లేకుండా.. మన పక్కింటి మనుషుల కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో శేఖర్ సిద్ధహస్తుడు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర’ చిత్రం మంచి విజయం సాధించడంతో, శేఖర్ తన తర్వాతి ప్రాజెక్టుపై దృష్టి సారించారు. అయితే ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. సుమారు 19 ఏళ్ల క్రితం టాలీవుడ్‌లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘హ్యాపీ డేస్’ సినిమాకు సీక్వెల్ రాబోతోందని సమాచారం.

2007లో విడుదలైన ‘హ్యాపీ డేస్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆ సినిమా అప్పట్లో యువతను ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను మళ్లీ వెండితెరపైకి తీసుకురావడానికి శేఖర్ కమ్ముల సిద్ధమవుతున్నారట. అయితే ఈసారి కథను ప్రస్తుత కాలానికి అనుగుణంగా, అంటే నేటి యువత ఆలోచనా ధోరణికి తగ్గట్టుగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ప్రభావం, మారుతున్న బంధాలు, నేటి తరం కాలేజ్ కుర్రాళ్ల కలలు.. ఇలా అన్ని అంశాలను మిక్స్ చేసి ఒక ఫ్రెష్ స్టోరీని శేఖర్ సిద్ధం చేశారట.

సాధారణంగా శేఖర్ కమ్ముల తన సినిమాల్లో కొత్తవారికి అవకాశాలు ఇవ్వడానికి మొగ్గు చూపుతుంటారు. ‘హ్యాపీ డేస్’ మొదటి భాగం ద్వారా వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ వంటి స్టార్లను పరిచయం చేసిన ఆయన.. ఇప్పుడు సీక్వెల్ కోసం కూడా కొత్త ముఖాలను అన్వేషిస్తున్నట్లు టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఆడిషన్స్ నిర్వహించి నటీనటులను ఫైనల్ చేయనున్నారని సమాచారం.

ఒకప్పుడు హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ అంటూ కాలేజ్ క్యాంపస్‌లో హ్యాపీ డేస్ పాటలు మారుమోగిపోయాయి. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అదే పేరుతో సీక్వెల్ వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘హ్యాపీ డేస్ 2’ ద్వారా శేఖర్ కమ్ముల మళ్లీ ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తారా? లేక సరికొత్త అనుభూతిని అందిస్తారా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే

Spotlight

Read More →