Remote Work: రిమోట్ వర్క్ తో మారిన జీవితం.. 40 నగరాల నుంచి పనిచేసిన వ్యాపారవేత్త అనుభవాలు!
Remote Work: టెక్నాలజీ అభివృద్ధితో ఉద్యోగ విధానాల్లో పెద్ద మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రిమోట్ వర్క్ విధానం చాలామంది ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలను అందిస్తోంది. ఒకే ఆఫీసులో కూర్చొని పనిచేయాల్సిన అవసరం లేకుండా ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా పని చేసే స్వేచ్ఛను ఇది కల్పిస్తోంది.
ఆఫీస్ లేకుండానే విజయం.. రిమోట్ వర్క్తో మారిన సంకల్ప్ సిన్హా జీవితం..
2018లో మొదలైన రిమోట్ ప్రయాణం.. స్వేచ్ఛ, అవకాశాలు అందించిన కొత్త పని విధానం..
టెక్నాలజీ అభివృద్ధితో ఉద్యోగ విధానాల్లో పెద్ద మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రిమోట్ వర్క్ (Remote Work) విధానం చాలామంది ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలను అందిస్తోంది. ఒకే ఆఫీసులో కూర్చొని పనిచేయాల్సిన అవసరం లేకుండా ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా పని చేసే స్వేచ్ఛను ఇది కల్పిస్తోంది.
తన రిమోట్ వర్క్ ప్రయాణం గురించి వ్యాపారవేత్త సంకల్ప్ సిన్హా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన నెక్స్ట్ డోర్ కంపెనీ (NextDoorCompany) సంస్థ వ్యవస్థాపకుడు. 2018లోనే పూర్తిస్థాయి రిమోట్ వర్క్ విధానాన్ని ఎంచుకున్న ఆయన, అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదని తెలిపారు.
సంకల్ప్ సిన్హా సోషల్ మీడియా వేదిక ఎక్స్లో తన అనుభవాలను పంచుకుంటూ, బెంగళూరులో మంచి ప్రకృతి వాతావరణం ఉన్న గేటెడ్ కమ్యూనిటీనే తనకు ఉత్తమ ఆఫీస్లా అనిపిస్తుందని చెప్పారు. రిమోట్ వర్క్ తనకు ఊహించని ఎన్నో అవకాశాలను అందించిందని పేర్కొన్నారు.
రిమోట్ వర్క్ కారణంగా తాను ఉద్యోగం చేస్తూనే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను సందర్శించే అవకాశం పొందానని సంకల్ప్ తెలిపారు. 2018 నుంచి ఇప్పటివరకు సుమారు 40 నగరాల్లో నివసిస్తూ పనిచేశానని చెప్పారు. ప్రతి నగరంలో సగటున మూడు వారాల పాటు ఉంటూ అక్కడి జీవన విధానం, సంస్కృతి, ప్రజలను దగ్గరగా తెలుసుకునే అవకాశం లభించిందన్నారు.
ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించడంతో పాటు, స్థానిక సంస్కృతిని అర్థం చేసుకోవడం, కొత్త వ్యక్తులను కలవడం తన జీవితంలో ప్రత్యేక అనుభూతులను ఇచ్చాయని వివరించారు.
2026లో తాను సొంత సాఫ్ట్వేర్ కంపెనీని నిర్మిస్తున్నానని, అది కూడా రిమోట్ విధానంలోనే కొనసాగిస్తున్నానని సంకల్ప్ తెలిపారు. భవిష్యత్తులో కూడా శాశ్వత ఆఫీస్ ఏర్పాటు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
రిమోట్ వర్క్ తనకు కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశాన్ని కూడా ఇచ్చిందని చెప్పారు. ఇంటి వెనుక ఉన్న లాన్లో కూర్చొని పనిచేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.
తాను 21 ఏళ్ల వయసులో సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఊహించని స్వేచ్ఛ, సమయం, ఆర్థిక అవకాశాలను రిమోట్ వర్క్ ద్వారా పొందగలిగానని సంకల్ప్ సిన్హా చెప్పారు.
పని చేసే విధానంలో మార్పు తీసుకొచ్చిన రిమోట్ వర్క్, కేవలం ఉద్యోగ పద్ధతినే కాకుండా వ్యక్తిగత జీవనశైలిని కూడా మార్చగలదని ఆయన అనుభవం చెబుతోంది. సాంకేతికతను సరిగ్గా వినియోగించుకుంటే ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా విజయవంతంగా పనిచేయవచ్చని ఆయన ప్రయాణం చూపిస్తోంది.
Tags
Be the first to react