Nara Lokesh: ఏపీలో షూఆల్స్ ఆర్అండ్డీ, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయండి.. దక్షిణ కొరియా సంస్థకు మంత్రి లోకేష్ ఆహ్వానం!
Nara Lokesh: దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించారు. పర్యటన రెండో రోజు సియోల్ లో ప్రముఖ స్మార్ట్ హెల్త్కేర్ ఫుట్వేర్ తయారీ సంస్థ షూఆల్స్ (Shoealls) కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్, సీఈవో లీ చియాంగ్-గెన్తో ఆయన సమావేశమయ్యారు.
షూఆల్స్ సంస్థతో ఏపీలో రూ.300 కోట్ల పాదరక్షల యూనిట్ – 3 వేల ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు షూఆల్స్ ఆసక్తి – ఇన్నోవేషన్ హబ్ ప్రతిపాదన..
దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించారు. పర్యటన రెండో రోజు సియోల్లో ప్రముఖ స్మార్ట్ హెల్త్కేర్ ఫుట్వేర్ తయారీ సంస్థ షూఆల్స్ (Shoealls) కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్, సీఈవో లీ చియాంగ్-గెన్తో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇప్పటికే కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (MoU) ప్రకారం రాష్ట్రంలో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగవంతం చేయాలని మంత్రి లోకేష్ కోరారు. సుమారు రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్లో షూఆల్స్ సంస్థ ఒక ఆర్అండ్డీ (R&D), ఇన్నోవేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. దీంతో రాష్ట్రాన్ని రిటైల్, డిస్ట్రిబ్యూషన్ హబ్గా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో షూఆల్స్ సంస్థ ఛైర్మన్ లీ చియాంగ్-గెన్ తమ సంస్థ ప్రత్యేకతలను వివరించారు. మాగ్నెటిక్ థెరపీ, షాక్ అబ్జార్ప్షన్, కూలింగ్ సోల్స్, యాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్స్ వంటి ఆధునిక సాంకేతికతతో రూపొందించిన MFDS సర్టిఫైడ్ మెడికల్ ఫుట్వేర్ తయారీలో తమ సంస్థ ముందంజలో ఉందని తెలిపారు.
అలాగే సియోల్ నేషనల్ యూనివర్సిటీ, ఈవా ఉమెన్స్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లతో కలిసి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత స్మార్ట్ మెడికల్ ఫుట్వేర్ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని, భవిష్యత్తులో రాష్ట్రంతో కలిసి పనిచేసే అవకాశాలను అధ్యయనం చేస్తామని షూఆల్స్ సంస్థ ఛైర్మన్ లీ చియాంగ్-గెన్ తెలిపారు. ఈ భేటీతో రాష్ట్రంలో అధునాతన ఫుట్వేర్ తయారీ, పరిశోధన, ఉపాధి అవకాశాలకు కొత్త ఊతం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Tags
Be the first to react