Liquor Rates: మందుబాబులకు గట్టి షాక్... భారీగా ధరలు పెంపు... రూ. 80 వరకు!! జూన్ 15 నుండి అమలు...!! Income Tax: ఐటీఆర్ ఫైలింగ్: 2026-27 అసెస్మెంట్ ఇయర్‌కు కొత్త గడువులు ఖరారు.. మిస్ అయితే జరిమానా తప్పదు! MSME: కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు! Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈ రోజు రేట్లు ఇలా...!! Vijayawada Airport: బెజవాడ టూ కాశీ డైరెక్ట్ ఫ్లైట్.. కేవలం 2 గంటల్లోనే బాబా దర్శనం, టికెట్ ధర ఎంతంటే! RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య విధానం ప్రకటన.. వడ్డీ రేట్లపై సర్వత్రా ఆసక్తి! NRI Investment: ప్రవాస భారతీయులకు ఆర్‌బీఐ బంపర్ ఆఫర్.. స్టాక్ మార్కెట్ పెట్టుబడి పరిమితులు పెంచుతూ నిర్ణయం! Interest Rates: మారబోని ఇళ్ల లోన్లు, కార్ లోన్ల వడ్డీ రేట్లు.. సామాన్యులకు ఊరటనిచ్చిన ఆర్‌బీఐ పాలసీ! Stock Market: ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు! Immigration: విదేశీ పౌరులకు కేంద్రం షాక్.. వీసా రిజిస్ట్రేషన్ నిబంధనలను కఠినతరం! Liquor Rates: మందుబాబులకు గట్టి షాక్... భారీగా ధరలు పెంపు... రూ. 80 వరకు!! జూన్ 15 నుండి అమలు...!! Income Tax: ఐటీఆర్ ఫైలింగ్: 2026-27 అసెస్మెంట్ ఇయర్‌కు కొత్త గడువులు ఖరారు.. మిస్ అయితే జరిమానా తప్పదు! MSME: కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు! Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈ రోజు రేట్లు ఇలా...!! Vijayawada Airport: బెజవాడ టూ కాశీ డైరెక్ట్ ఫ్లైట్.. కేవలం 2 గంటల్లోనే బాబా దర్శనం, టికెట్ ధర ఎంతంటే! RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య విధానం ప్రకటన.. వడ్డీ రేట్లపై సర్వత్రా ఆసక్తి! NRI Investment: ప్రవాస భారతీయులకు ఆర్‌బీఐ బంపర్ ఆఫర్.. స్టాక్ మార్కెట్ పెట్టుబడి పరిమితులు పెంచుతూ నిర్ణయం! Interest Rates: మారబోని ఇళ్ల లోన్లు, కార్ లోన్ల వడ్డీ రేట్లు.. సామాన్యులకు ఊరటనిచ్చిన ఆర్‌బీఐ పాలసీ! Stock Market: ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు! Immigration: విదేశీ పౌరులకు కేంద్రం షాక్.. వీసా రిజిస్ట్రేషన్ నిబంధనలను కఠినతరం!

తస్మా జాగ్రత్త! పేస్ బుక్ లింక్‌ హిస్టరీ ఫీచర్‌ గురించి తెలుసా? మీరు క్లిక్‌ చేసే లింక్స్‌ డేటా అంతా నిల్వ చేస్తుంది!

ఫేస్‌బుక్‌... ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే యాప్‌లో ఇది ఒకటి. భారత్‌లోనూ ఎక్కువ మంది ఫేస్‌బుక్‌ను (పేస్ బుక్ ) విన

Published : 2024-01-20 15:35:00

ఫేస్‌బుక్‌... ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే యాప్‌లో ఇది ఒకటి. భారత్‌లోనూ ఎక్కువ మంది ఫేస్‌బుక్‌ను (పేస్ బుక్ ) వినియోగిస్తున్నారు.

గతంలో ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత లేక ఇతర ఫోటోలు వీడియోలను మాత్రమే పోస్ట్‌ చేసేవారు. అయితే ప్రస్తుతం వ్యాపార ప్రకటనలు సహా ఇతర వాణిజ్య కలాపాలకు కూడా ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు.

ఫేస్‌బుక్ లింక్ హిస్టరీ: అయితే మెటా నేతృత్వంలోని ఫేస్‌బుక్‌ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అనేక కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుంది.

అయితే ఈ ఫీచర్లలో లింక్‌ హిస్టరీ కూడా ఉంది. అయితే ఏంటీ లింక్ హిస్టరీ... ఎలా పనిచేస్తుంది. వినియోగదారులకు ఉపయోగపడుతుందా లేక హాని చేస్తుందా వంటి వివరాలతో కూడిన పూర్తి కథనం మీకోసం. 

అనుమతిస్తే డేటా నిల్వ అవుతుంది: ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో అనేక రకాలైన ప్రకటనలకు సంబంధించిన లింక్‌లు వస్తుంటాయి. ఇందులో అవసరమైనవి, అనవసరం రెండు ఉంటాయి.

తెలిసి తెలియకుండా ఈ లింక్ పైన క్లిక్‌ చేస్తుంటాం. ఆ డేటా అంతా ఒకచోట భద్రపరచపడుతుంది. దీన్నే లింక్‌ హిస్టరీ అంటాం.

ఇందులో వినియోగదారులు క్లిక్‌ చేసిన లింక్‌లు, వెబ్‌సైట్‌ వివరాలు వంటి డేటాను నిల్వ చేస్తుంది.

ఫీచర్‌ను ఆన్‌ లేదా ఆఫ్‌ చేయవచ్చు: ఆ కారణంగా పదేపదే వాటికి సంబంధించిన ప్రకటనలు మీకు కనిపిస్తుంటాయి. నిజానికి వినియోగదారుడు ఆసక్తి చూపే సమాచారాన్ని వీక్షించడానికి ఫేస్‌బుక్‌ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

అయితే ఈ ఫీచర్‌ను ఆన్‌ లేదా ఆఫ్‌ చేసే అవకాశం ఉంది. ఫలితంగా ఇందుకు సంబంధించిన యాడ్స్‌ను మనం నియంత్రించవచ్చు.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

లింక్‌ హిస్టరీని ఎలా ఆఫ్‌ చేయాలి: ముందుగా వినియోగదారుడు తన ఫేస్‌బుక్‌ యాప్‌ అప్‌డేట్‌గా ఉందో లేదో చెక్‌ చేసుకోవాలి. అనంతరం యాప్‌ను కిందకు స్కోల్ చేయాలి.

అక్కడ మీకు లింక్‌ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్‌ చేయాలి. అనుమతించమని (అల్లఓ లింక్ హిస్టరీ) కోరుతుంది. అక్కడ క్లిక్ చేయడం ద్వారా సమాచారాన్ని చూడవచ్చు.

యాక్టివేట్ అయిన తర్వాత మీరు క్లిక్‌ చేసిన లింక్స్‌ అక్కడ కనిపిస్తాయి. అక్కడ మీ డేటాను చూడవచ్చు. సమాచారం నిల్వ చేయవద్దు అనిపిస్తే.

అక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ద్వాని ద్వారా ఆన్‌ లేదా ఆఫ్‌ చేసుకోవచ్చు. దాంతోపాటు పాత హిస్టరీని డిలీట్‌ చేయవచ్చు. గత 30 రోజుల హిస్టరీని తొలగించవచ్చు.

అందుకు కిందనే క్లియర్‌ హిస్టరీ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపైన క్లిక్‌ చేసి హిస్టరీని తొలగించవచ్చు. ఫలితంగా మీ ఫెస్‌బుక్‌ హిస్టరీ తొలగిపోవడం సహా మీకు అవసరం లేని యాడ్స్‌ వచ్చే అవకాశం ఇక ఉండదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది.

తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →