ప్రైవేట్ టెలికాం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తోంది. 12 నెలల వ్యాలిడిటీ ప్లాన్ అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. ప్రధానంగా నెలవారీ కేవలం రూ.154 ధర మాత్రమే. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ఎస్టీడీ, రోమింగ్, వాయిస్ కాల్స్ కూడా ఉచితంగా పొందుతారు.
మీ సిమ్ కూడా 12 నెలల పాటు యాక్టీవ్‌గా ఉంటుంది. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లో అదనంగా మూడు ప్రయోజనాలు కూడా పొందుతారు. హలో ట్యూన్స్ ఆఫర్స్‌తో పాటు 30 రోజుల పాటు ఒక ట్యూన్ ఉచితంగా అందిస్తుంది. ఎస్ఎంఎస్‌లు కూడా ఈ ప్లాన్‌లో ఉచితంగా పొందుతారు.
ఎయిర్‌టెల్ ఈ ఏడాది రీఛార్జ్ ప్లాన్ తో 365 రోజుల వ్యాలిడిటీ 3600 ఎస్ఎంఎస్లు ఉచితంగా పొందుతారు. ఈ ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదంతా ఎంజాయ్ చేసే బంపర్ ప్లాన్. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లో ఏఐ ప్రో పెర్‌ప్లెక్సిటీ ఆఫర్ కూడా అందిస్తుంది.
ఏడాది వ్యాలిడిటీ అందుబాటులో ఉండే ఈ ప్లాన్‌లో డేటా అందుబాటులో లేదు. ఎయిర్‌టెల్ రూ.1849 ప్లాన్ ఏడాదిలో ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్లాన్ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే ఇందులో మీరు డేటా కూడా పొందాలంటే ఎయిర్‌టెల్ రూ. 2249 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.
ఈ ప్లాన్‌లో 30 జీబీ డేటా పొందుతారు. ఈ 30 జీబీ నెలవారీ లిమిట్ లేదు. ఏడాది మొత్తం డేటా వినియోగించుకోవచ్చు అయితే డేటా పూర్తి అయిపోయిన తర్వాత అదనంగా డేటా అందుబాటులో మాత్రం ఉండదు.
దీంతోపాటు 3600 ఎస్ఎంఎస్ లు ఉచితం ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. స్పామ్ కాల్ అలర్ట్ కూడా పొందుతారు. అలాగే ఎయిర్‌టెల్ పెర్‌ప్లెక్సిటీ ఆఫర్ కూడా వర్తిస్తుంది.