పుదుచ్చేరిలో నేడు జరగనున్న విజయ్ (Vijay) బహిరంగ సభకు ఒక వ్యక్తి తుపాకీతో చొరబడేందుకు యత్నించడం ఆందోళన కలిగించింది.
తుపాకీతో వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఎన్నో రోజుల తర్వాత తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ తిరిగి ప్రజల్లోకి రానున్న విషయం తెలిసిందే.
గతంలో కరూర్లో నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తీవ్ర విషాదాన్ని దృష్టిలో పెట్టుకొని పుదుచ్చేరి పోలీసులు ఈ బహిరంగ సభకు కఠినమైన భద్రతను అమలుచేస్తున్నారు. అలాగే జనసమూహ నియంత్రణ చర్యలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఈ సమావేశానికి కేవలం 5000 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు (Vijay Rally). ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఈ సభలోకి ప్రవేశించకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
పసిపిల్లలు, గర్భిణులు, వృద్ధులు రాకుండా నిషేధం విధించారు. పార్టీ జారీ చేసిన క్యూఆర్ కోడ్ పాస్ ఉన్న వ్యక్తులకు మాత్రమే వేదిక పైకి అనుమతించనున్నారు.