MATA: పెన్సిల్వేనియాలో ‘మాటా’ 2వ మహాసభలు! యువత కోసం ప్రత్యేక యూత్ ఫోరమ్..

Mana America Telugu Association (MATA): అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మన అమెరికా తెలుగు సంఘం (MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2వ కన్వెన్షన్ వేడుకలు జూన్ 19, 20 తేదీలలో ఘనంగా జరగనున్నాయి.

Published : 2026-04-17 14:20:00

యువత కోసం ప్రత్యేక యూత్ ఫోరమ్..

జూన్ 20న మధ్యాహ్నం 2 గంటల నుండి..

అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మన అమెరికా తెలుగు సంఘం (MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2వ కన్వెన్షన్ వేడుకలు జూన్ 19, 20 తేదీలలో ఘనంగా జరగనున్నాయి. ఈ మహాసభలకు గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్ వేదిక కానుంది. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగు వాతావరణం నెలకొననుంది.

కన్వెన్షన్ రెండో రోజైన జూన్ 20న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ‘యూత్ ఫోరమ్’ను నిర్వహించనున్నారు. “కల్చర్, టాలెంట్, ఫన్” అనే నినాదంతో యువతలో ఉత్సాహాన్ని నింపేలా ఈ వేదికను సిద్ధం చేశారు. యువతకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే అరుదైన అవకాశం ఈ ఫోరమ్ ద్వారా లభించనుంది.

ఈ యూత్ ఫోరమ్‌లో పాల్గొనే వారికి పలు ఆసక్తికరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ తారలను కలిసే “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అదేవిధంగా కహూత్, మూవీ ట్రివియా వంటి సరదా క్విజ్ పోటీలు, ఫన్ గేమ్స్ నిర్వహించనున్నారు. వీటిలో గెలుపొందిన వారికి ఆకర్షణీయ బహుమతులు అందించనున్నారు.

ఈ కార్యక్రమానికి చైర్‌గా సాయి చేతన్ దండమూడి, కో-చైర్లుగా శరణ్య రావు దుడ్డగి, అన్విత గూడూరు వ్యవహరిస్తున్నారు. సలహాదారులుగా కళ్యాణి బెల్లంకొండ, బాలాజీ జిల్లా పర్యవేక్షిస్తున్నారు. ఆసక్తి గల వారు పోస్టర్‌లో ఇచ్చిన లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

మాటా అధ్యక్షుడు రమణ కిరణ్ దుడ్డగి, కన్వీనర్ శ్రీధర్ గూడాల, కో-కన్వీనర్ టోనీ జన్న నేతృత్వంలో కార్యవర్గం ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. వ్యవస్థాపకులు, సలహా కమిటీ సభ్యులైన శ్రీనివాస్ గణగోని, ప్రదీప్ సామల, జితేందర్ రెడ్డిల మార్గదర్శకత్వంలో ఈ కన్వెన్షన్ జరుగుతోంది.

అమెరికాలో తెలుగు యువతకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా ఈ యూత్ ఫోరమ్ నిలవనుంది. సాంస్కృతిక, వినోదాత్మక కార్యక్రమాలతో ఈ కన్వెన్షన్ తెలుగు కమ్యూనిటీకి మరపురాని అనుభూతిని అందించనుంది.

Spotlight

Read More →