Bhogapuram Airport: ఉత్తరాంధ్ర చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Bhogapuram Airport: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం'గా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నామకరణం చేసింది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కానుండగా, ఆగస్టు 17 నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి,. ఈ నూతన విమానాశ్రయం ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యంతో ఉత్తరాంధ్ర పారిశ్రామిక, పర్యాటక రంగాల రహిత విస్తరణకు తోడ్పడనుంది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
భోగాపురం ఎయిర్‌పోర్ట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
  • అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్: కేంద్ర ప్రభుత్వం అధికారిక నామకరణం!

  • ఆగస్టు 1న ప్రధాని మోడీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం!

  • ఆగస్టు 17 నుంచి భోగాపురం నుంచి విమాన ప్రయాణాలు.. సివిల్ ఏవియేషన్ క్లారిటీ!

Bhogapuram Airport: భోగాపురం వద్ద నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ, ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' గా పేరు ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆగస్టు 1 వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులు హాజరుకానున్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఆగస్టు 17 వ తేదీ రాత్రి (12:01 AM) నుంచి సాధారణ ప్యాసింజర్ విమాన సర్వీసులు (Scheduled Commercial Operations) ఇక్కడి నుండి అధికారికంగా ప్రారంభమవుతాయి,.

ఆగస్టు 17న భోగాపురం విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమవ్వడంతో, ఇప్పటివరకు విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగా (INS Dega) నావల్ ఎయిర్‌పోర్ట్ నుండి నడుస్తున్న సివిల్ ఎన్క్లేవ్ సర్వీసులు తాత్కాలికంగా ఇక్కడికి షిఫ్ట్ కానున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మరియు గందరగోళం లేకుండా ఉండటానికి, ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు ఉన్న ఐఏటీఏ కోడ్ (VTZ) నే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా కేటాయించారు.

తొలిదశ (Phase 1) నిర్మాణంలో భాగంగా ఈ విమానాశ్రయాన్ని రోజుకు 200 విమానాలను హ్యాండిల్ చేసే అత్యధునిక కెపాసిటీతో మరియు సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే వీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. తెలుగు సంస్కృతి, చరిత్ర మరియు ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా టెర్మినల్ డిజైన్లను రూపొందించారు. అంతేకాకుండా, విశాఖపట్నం నగరం నుండి ప్రయాణికులు సులభంగా చేరుకోవడానికి విఎమ్‌ఆర్‌డిఏ ఆధ్వర్యంలో సిక్స్ లేన్ ఎక్స్‌ప్రెస్ వే కనెక్టివిటీ రోడ్డు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో విదేశీ పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, మరియు పర్యాటక రంగం వేగవంతంగా విస్తరించనున్నాయి. రాబోయే రోజుల్లో విశాఖపట్నం నుండి భోగాపురం వరకు మహానగర విస్తరణ జరిగి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు మరియు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

Tags

Be the first to react

Latest