Chandrababu: విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో చంద్రబాబు టాప్... రెండేళ్లలోనే ఆరు రెట్లు పెరిగిన పెట్టుబడులు!
Chandrababu: వైసీపీ ఎంపీ ప్రశ్నకు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సమాధానంతో రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు రెండేళ్లలో 6 రెట్లు పెరిగి $608.59 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వెల్లడైంది. సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, మంత్రి లోకేష్ పారిశ్రామిక విధానాల వల్ల గూగుల్, టీసీఎస్, అదానీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఏపీలో భారీ పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని కోమటి జయరామ్ స్పష్టం చేశారు.
గూగుల్, టీసీఎస్ నుండి అదానీ, మిట్టల్ వరకు.. నవ్యాంధ్రకు క్యూ కట్టిన గ్లోబల్ కంపెనీలు..!
కూటమి ప్రభుత్వ సమర్థతకు కేంద్రమే ఇచ్చింది సర్టిఫికెట్.. కోమటి జయరామ్ సంచలన వ్యాఖ్యలు..!
రాష్ట్రాభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తే మనుగడ కష్టం.. ప్రతిపక్ష కుట్రలకు చెక్ పెట్టిన గణాంకాలు..!
Chandrababu: శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోమటి జయరామ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ సమర్థతకు మరియు పారిశ్రామిక అనుకూల విధానాలకు కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా సర్టిఫికెట్ ఇచ్చినట్లయిందని తెలిపారు. గడిచిన వైసీపీ పాలనలో 2023-24 విద్యా/ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) కేవలం $9,213 మిలియన్ డాలర్లు మాత్రమే కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా పెరిగిందని గణాంకాలతో వివరించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడులు $233.14 మిలియన్ డాలర్లకు, ఆ తర్వాత 2025-26 నాటికి ఏకంగా $608.59 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయని జయరామ్ వెల్లడించారు. కేవలం రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రానికి వచ్చే విదేశీ పెట్టుబడులు ఆరు రెట్లు పెరగడం సీఎం చంద్రబాబు నాయుడి విజన్, క్రెడిబిలిటీ మరియు బ్రాండ్ ఇమేజ్‌కు నిదర్శనమని కొనియాడారు. దేశంలోకి వస్తున్న ప్రతి 100 రూపాయల పెట్టుబడిలో ఏకంగా 25 రూపాయల పెట్టుబడులు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తున్నాయని పార్లమెంట్ సాక్షిగా స్పష్టమైందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలుపుతుంటే, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాలతో పారిశ్రామికవేత్తలలో నమ్మకాన్ని పునరుద్ధరించారని తెలిపారు. దీని ఫలితంగానే గూగుల్ (Google), టీసీఎస్ (TCS), కాగ్నిజెంట్ (Cognizant), క్యారియర్ (Carrier), ఆర్పెక్స్, ఆర్చెలర్ మిట్టల్ (ArcelorMittal), రిలయన్స్ (Reliance), బ్రూక్‌ఫీల్డ్ (Brookfield), అదానీ (Adani) వంటి అంతర్జాతీయ ఐటీ, పారిశ్రామిక దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఆయన వివరించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బెదిరింపులు, "J-Tax" భయాలతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోగా, నేడు కూటమి ప్రభుత్వ సుపరిపాలన మరియు ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానాలతో విదేశీ పెట్టుబడిదారులు ఏపీకి క్యూ కడుతున్నారని జయరామ్ అన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని, యువతకు ఉద్యోగావకాశాలు రాకుండా చేయాలనే దురుద్దేశంతో ప్రతిపక్ష నాయకులు చేస్తున్న కుట్రలు ఇకనైనా మానాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో వారికి ఉన్న అరకొర స్థానాలు కూడా గల్లంతవుతాయని హెచ్చరించారు.
Be the first to react