ఖుషి ఖుషి గా కానిస్టేబుళ్లు.. భారీగా పెరిగిన జీతభత్యాలు!
అమరావతి: పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటూ ప్రజలకు సేవ చేయాలని నూతనంగా విధుల్లోకి అడుగుపెడుతున్న కానిస్టేబుళ్లకు సూచించారు. పోలీసు యూనిఫాం ప్రజల్లో భయాన్ని కాకుండా భరోసాను కల్పించేలా ఉండాలని పేర్కొన్నారు.
- రూ.4,500 ఉన్న కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ను రూ.12,500కు పెంచుతున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు.
- క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.
అమరావతి: పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటూ ప్రజలకు సేవ చేయాలని నూతనంగా విధుల్లోకి అడుగుపెడుతున్న కానిస్టేబుళ్లకు సూచించారు. పోలీసు యూనిఫాం ప్రజల్లో భయాన్ని కాకుండా భరోసాను కల్పించేలా ఉండాలని పేర్కొన్నారు.
మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం 2025–26 బ్యాచ్‌కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు అవార్డులను అందజేశారు.
స్టైపెండ్ రూ.12,500కు పెంపు
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో రాష్ట్రంలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను ఎన్నో అడ్డంకులను అధిగమించి పూర్తి చేశామని తెలిపారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా 21 శిక్షణ కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తయిందని తెలిపారు. వీరిలో 2,330 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఉన్నారని వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో సుమారు 1,000 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండటం విశేషమన్నారు.
ప్రజలకు పోలీసులంటే భరోసా కలగాలి
పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. విపత్తులు, బందోబస్తు, అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు.
సైబర్ నేరాల నియంత్రణకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలపై కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ అందించామని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా విని, వారికి సత్వర న్యాయం అందేలా పనిచేయాలని సూచించారు. పోలీసులంటే ప్రజల్లో భయం కాకుండా భరోసా కలిగేలా వ్యవహరించాలని హితవు పలికారు.
రాజ్యాంగానికి అనుగుణంగా విధులు
రాజ్యాంగానికి అనుగుణంగా, రాగద్వేషాలకు అతీతంగా నీతి, నిజాయితీ, కర్తవ్య స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని హోంమంత్రి అనిత దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన 2047 విజన్‌లో కానిస్టేబుళ్లు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పదవీ విరమణ వరకు క్రమశిక్షణతో, ప్రశాంతంగా ప్రజలకు సేవలందిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని నూతన కానిస్టేబుళ్లకు హోంమంత్రి సూచించారు.
Tags
Be the first to react
