ఇక ప్రతి పేద కుటుంబానికీ 2029 నాటికి సొంతిల్లు! ఏపీ ప్రభుత్వం టార్గెట్ ఇదే!
అమరావతి: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో గృహ నిర్మాణ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 5.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించినట్లు వెల్లడించారు.
- 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పీతల సుజాత తెలిపారు
- PMAY-U 2.0 2026 అవార్డుల్లో ఏపీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు.
అమరావతి: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో గృహ నిర్మాణ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 5.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించినట్లు వెల్లడించారు.
మీడియాతో మంగళవారం మాట్లాడిన పీతల సుజాత.. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని అప్పటి సీఎం జగన్ ప్రకటించినప్పటికీ, ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. అంతేకాకుండా పేదల కోసం మంజూరైన సుమారు 6 లక్షల ఇళ్లను రద్దు చేసి వారి సొంతింటి ఆశలను దెబ్బతీశారని విమర్శించారు.
అదనంగా 3 లక్షల ఇళ్లకు కేంద్రం అనుమతి
రాష్ట్రానికి సాధారణ కోటా కింద కేంద్ర ప్రభుత్వం 75 వేల ఇళ్లను మాత్రమే మంజూరు చేసిందని సుజాత తెలిపారు. అయితే సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించి రాష్ట్రానికి అదనంగా 3 లక్షల ఇళ్లను మంజూరు చేయించారని పేర్కొన్నారు. కొత్తగా నిర్మించనున్న 3 లక్షల ఇళ్లకు కేంద్ర మంత్రి చౌహాన్‌తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.
తెనాలిలో 3D టెక్నాలజీతో ఇళ్లు
గృహ నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని సుజాత చెప్పారు. తెనాలిలో దేశంలోనే తొలిసారిగా 3D టెక్నాలజీ ద్వారా 177 ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు నాణ్యతను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
PMAY-U 2.0 అవార్డుల్లో ఏపీకి గుర్తింపు
PMAY-U 2.0 2026 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం రాష్ట్ర గృహ నిర్మాణ కార్యక్రమాల పురోగతికి నిదర్శనమని పీతల సుజాత అన్నారు. గృహ నిర్మాణంలో పారదర్శకత, వేగవంతమైన అమలుకు ఈ అవార్డు గుర్తింపుగా నిలిచిందని తెలిపారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్’ విధానానికి గృహ నిర్మాణ రంగంలో సాధించిన పురోగతి ఒక ఉదాహరణగా నిలుస్తోందన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పీతల సుజాత స్పష్టం చేశారు.
Be the first to react