Chandrababu: జస్ట్‌ నిమిషాల్లోనే ప్రయాణం.. ఏపీలో అందుబాలులోకి 2 కొత్త రహదారులు! నేడేప్రారంభించనున్న సీఎం చంద్రబాబు!

Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డును మరియు బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన ఐకానిక్ స్టీల్ బ్రిడ్జ్‌ను ప్రారంభించనున్నారు. ఈ రహదారి రాకతో రాజధానికి కనెక్టివిటీ మరింత వేగవంతం కానుంది.

ap cm chandrababu naidu to inaugurate e 3 seed access road and buckingham canal steel bridge today
ap cm chandrababu naidu to inaugurate e 3 seed access road and buckingham canal steel bridge today
  • తొమ్మిది వరుసల రాజమార్గం సిద్ధం!.. నేటితో అందుబాటులోకి అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు!..

  • ఉండవల్లి టు రాజధాని కనెక్టివిటీ రన్!.. సీఎం చంద్రబాబు మార్క్ ప్రాజెక్ట్ షురూ!..

  • మంత్రి నారాయణ ట్రయల్ రన్ సక్సెస్!.. నేడే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రక్రియలో మరొక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. అమరావతి నగరానికి ప్రధాన జీవనాడిగా మరియు ప్రవేశ ద్వారంగా భావించే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు బకింగ్‌హామ్ కెనాల్ మరియు కొండవీటి వాగులపై నిర్మించిన ప్రతిష్టాత్మక ఐకానిక్ స్టీల్ బ్రిడ్జ్‌ను ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. రాజధాని అనుసంధానతను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుండటంతో అమరావతి పరిసర ప్రాంతాలలో పండుగ వాతావరణం నెలకొంది.

రాజధాని నగర పరిధిలో మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవునా తొమ్మిది వరుసల (3+3+3) అత్యంత విశాలమైన గ్రీన్‌ఫీల్డ్ మార్గంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డును రూపొందించారు. మధ్యలో సెంట్రల్ బిఆర్‌టిఎస్ (BRTS) కారిడార్ మరియు ఇరువైపులా 11 మీటర్ల సర్వీస్ రోడ్లతో ఈ రహదారి రూపుదిద్దుకుంది. దొండపాడు నుండి వెంకటపాలెం వరకు మొదటి విడత నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, వెంకటపాలెం నుండి ఉండవల్లి పాత జాతీయ రహదారిని కలుపుతూ స్టీల్ బ్రిడ్జ్‌లతో నిర్మించిన రెండవ విడత పనులు ఇప్పుడు పూర్తయ్యాయి. నిన్ననే పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తన కాన్వాయ్‌తో ఈ రోడ్డు మరియు బ్రిడ్జ్‌లపై విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించి ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ ప్రాజెక్ట్‌లో బకింగ్‌హామ్ కెనాల్ మరియు కొండవీటి వాగులపై అత్యంత ఆధునిక ఇంజనీరింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన భారీ స్టీల్ బ్రిడ్జ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సకాలంలో నిర్మాణం పూర్తయిన ఈ వంతెనల వల్ల అమరావతి కోర్ క్యాపిటల్ లోపలికి వాహనాల రాకపోకలు అత్యంత వేగవంతం కానున్నాయి. కొండవీటి వాగు పంపింగ్ స్టేషన్ పక్కగా సాగే రహదారిని పటిష్టమైన తార్ రోడ్డుగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రయాణికుల భద్రత కోసం ఇరువైపులా క్రష్ బారియర్లు, రక్షణ గోడలు మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్డు మార్కింగ్ పనులను పూర్తి చేశారు.

రాజధాని ప్రవేశ ద్వారం వద్ద పర్యాటకులకు మరియు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు గాను ప్రత్యేక గ్రీన్ బెల్ట్‌ను తీర్చిదిద్దారు. అమరావతి నిర్మాణ ప్రక్రియలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ADC) ఆధ్వర్యంలో ఇన్నాళ్లూ ప్రత్యేకంగా సంరక్షించిన పెద్ద పెద్ద చెట్లను ఇక్కడ వేళ్లతో సహా నాటారు. సీడ్ యాక్సెస్ రోడ్డు రాబోయే మూడవ విడతలో భాగంగా ఉండవల్లి సెంటర్ నుంచి నేషనల్ హైవే 16 (NH-16) వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ మరియు సీతానగరం వద్ద బటర్‌ఫ్లై జంక్షన్ నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రావడం ద్వారా రాజధాని పరిధిలోని ప్రధన గ్రిడ్ రోడ్లు (N1 నుండి N7 వరకు) అనుసంధానమవడమే కాకుండా, తదుపరి దశలో చేపట్టబోయే E5 (ఎయిమ్స్ - అసెంబ్లీ) మేజర్ ఆర్టీరియల్ రహదారి నిర్మాణానికి మార్గం సుగమమైంది. విజయవాడ, గుంటూరు మరియు మంగళగిరి నగరాల నుంచి అమరావతికి రవాణా సౌకర్యం సులభతరం కావడంతో పాటు వ్యాపార, పారిశ్రామిక రంగానికి ఈ రాజమార్గం సరికొత్త ఊపునివ్వనుంది. సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న ఈ ప్రాజెక్ట్ అమరావతి శరవేగంగా పునర్వైభవాన్ని సంతరించుకుంటోందనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలవనుంది.

Tags

Be the first to react

Latest