నేడు ఎకరా లక్షల్లో! భవిష్యత్తులో 100ల కోట్లు! అమరావతి ORR పరిధిలో అతి ముఖ్య ప్రదేశాలు!
Amaravati ORR: ఎన్‌హెచ్ఏఐ టెండర్లు పిలిచిన రూ. 30,491 కోట్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (189.93 కి.మీ, 6 వరసలు) ప్రాజెక్టులో రియల్ ఎస్టేట్ పరంగా అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చే 4 కీలక ప్రాంతాలు ఇవే. రాజధానికి అత్యంత సమీపంలో ఉండి కోకాపేటలా మారే అవకాశం ఉన్న బలుసుపాడు, ఎయిర్‌పోర్టుకు దగ్గరగా ఉండే పేరేచర్ల, హైదరాబాద్ హైవే-లాజిస్టిక్స్ అనుసంధానం గల కంచికచర్ల, మరియు పోర్ట్ కారిడార్‌గా ఎదిగే చలివేంద్రపాలెం ప్రాంతాలు ఇన్వెస్టర్లకు గోల్డ్ మైన్లుగా మారనున్నాయి.
కంచికచర్ల డబుల్ ట్రంపెట్ సంచలనం.. హైదరాబాద్ హైవే, మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ!
చలివేంద్రపాలెం పోర్ట్ ఇండస్ట్రియల్ కారిడార్.. ఎన్‌హెచ్ 65 వెంబడి భూముల దూకుడు!
189 కిలోమీటర్లు, 6 వరసల గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వే.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌ను మించిన పొడవు!
Andhrapradesh (Amaravati): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ప్రాజెక్టుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారికంగా టెండర్లు ఆహ్వానించింది. మొత్తం రూ. 30,491 కోట్ల భారీ వ్యయంతో నాలుగు ప్యాకేజీల కింద ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పొడవు 158 కిలోమీటర్లు ఉండగా, అమరావతి ఓఆర్ఆర్ ఏకంగా 189.93 కిలోమీటర్ల సుదీర్ఘ నిడివితో ఆరు వరసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా రూపుదిద్దుకుంటోంది. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల పరిధిలోని 23 మండలాల మీదుగా సాగే ఈ రహదారికి లోపలి వైపు మాత్రమే సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు విస్తరణతో ఒకప్పుడు సాధారణ గ్రామంగా ఉన్న కోకాపేటలో ఎకరం భూమి వందల కోట్ల రికార్డు స్థాయికి చేరినట్లే, నేడు అమరావతి ఓఆర్ఆర్ పరిధిలోని బలుసుపాడు, పేరేచర్ల, కంచికచర్ల వంటి ప్రాంతాలు కూడా భవిష్యత్తులో ఆ స్థాయికి చేరుకుంటాయని నిపుణులు అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. రాజధాని కోర్ క్యాపిటల్‌కు అత్యంత సమీపంలో ఉండటంతో పాటు ఎయిర్‌పోర్ట్ కారిడార్లు, ఐటీ, లాజిస్టిక్స్ హబ్‌లు సరైన మౌలిక వసతులు, ప్రపంచ స్థాయి అనుసంధానం వేగవంతమైతే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ముఖచిత్రంలో ఈ ఇంటర్చేంజ్ ప్రాంతాలు మరో కోకాపేట తరహాలో వందల కోట్ల సంపదను సృష్టించే బంగారు గనులుగా మారడం ఖాయమని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
17 ఇంటర్చేంజ్‌లు – వ్యూహాత్మక అనుసంధానం
ఈ ఎక్స్‌ప్రెస్‌వేలోకి వాహనాలు ప్రవేశించడానికి, బయటకు వెళ్ళడానికి మొత్తం 17 ప్రాంతాల్లో ఇంటర్చేంజ్‌లను నిర్మిస్తున్నారు. వీటిలో ప్రధాన జాతీయ రహదారులు కలిసే చోట్ల ఎనిమిది డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్‌లు, కర్నూలు మార్గంలో పేరేచర్ల వద్ద ఒక సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్, రాష్ట్ర రహదారులు కలిసే చోట్ల రోటరీ ఇంటర్చేంజ్‌లను ప్లాన్ చేశారు. కంచికచర్ల, దుగ్గిరాలపాడు, మైలవరం, ఆగిరిపల్లి, పెద్దఅవుటపల్లి, చలివేంద్రపాలెం, నారాకోడూరు, పొత్తూరు, పేరేచర్ల, బలుసుపాడు వంటి కీలక ప్రాంతాల వద్ద మాత్రమే వాహనాలు ఎక్కేందుకు, దిగేందుకు అవకాశం ఉంటుంది.
మొదటి గోల్డ్ మైన్: బలుసుపాడు (Navyandhar Kokapeta)
రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అత్యంత కీలకమైన మొదటి ప్రాంతంగా పల్నాడు-గుంటూరు సరిహద్దుల్లోని బలుసుపాడు నిలుస్తోంది. కోర్ క్యాపిటల్ అమరావతికి కేవలం 7 నుంచి 8 కిలోమీటర్ల అతి సమీపంలో ఈ రోటరీ ఇంటర్చేంజ్ వస్తోంది. రాబోయే రోజుల్లో చేపట్టే అమరావతి థర్డ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్‌లో ఈ ప్రాంతం రాజధానిలో విలీనమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. క్వాంటం వ్యాలీ, ఐటీ అనుబంధ హార్డ్‌వేర్ పరిశ్రమలు మరియు రావెల వద్ద ప్రతిపాదిత విమానాశ్రయం ఈ పశ్చిమ భాగానికే చేరువలో రానున్నాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్‌లో గచ్చిబౌలి, కోకాపేట ఎంతటి డిమాండ్ పొందాయో.. అమరావతి ఓఆర్ఆర్‌లో బలుసుపాడు అంతటి ప్రాధాన్యతను సంతరించుకోనుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
రెండో గోల్డ్ మైన్: పేరేచర్ల (Rayalaseema Gateway & Airport Corridor)
పెట్టుబడులకు రెండో ప్రాధాన్యతగా గుంటూరు సమీపంలోని పేరేచర్ల పరిసర ప్రాంతాలు ఎంపికవుతున్నాయి. గుంటూరు-కర్నూలు రహదారిపై ఇక్కడ సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మిస్తున్నారు. కర్నూలు, నంద్యాల, మార్కాపురం మరియు తెలంగాణలోని పిడుగురాళ్ల మీదుగా రాజధానికి వచ్చే రాకపోకలకు ఇది ముఖద్వారంగా మారుతుంది. అంతేకాకుండా రావెల వద్ద నిర్మించే నూతన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు ఇది కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. రాజధాని పశ్చిమ దిశగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పేరేచర్ల, మేడికొండూరు పరిసరాల్లో భూముల విలువలకు తిరుగులేని డిమాండ్ ఏర్పడనుంది.
మూడో గోల్డ్ మైన్: కంచికచర్ల (Hyderabad Highway & Logistics Hub)
ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని క్రాస్ చేస్తూ డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ రానుంది. తెలంగాణ నుంచి అమరావతి కోర్ క్యాపిటల్‌కు చేరుకోవడానికి ఇదే ప్రధాన ఎంట్రీ పాయింట్. ఇక్కడి నుంచి కృష్ణా నదిపై నూతన బ్రిడ్జి ద్వారా రాజధాని కేంద్రానికి దూరం కేవలం 20 కిలోమీటర్లలోపే ఉంటుంది. జగ్గయ్యపేట, జయంతిపురం ఇండస్ట్రియల్ కారిడార్లు, పరిటాల సమీపంలో రానున్న మెగా లాజిస్టిక్స్ పార్కులకు ఇది అత్యంత కీలకం. హైదరాబాద్ హైవే నుంచి మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ ఇచ్చే ప్రధాన రూట్ కావడంతో వాణిజ్యపరంగా కంచికచర్ల బంగారు గనిలా మారనుంది.
నాలుగో గోల్డ్ మైన్: చలివేంద్రపాలెం (Machilipatnam Port Industrail Zone)
నాల్గవ కీలక కేంద్రంగా మచిలీపట్నం జాతీయ రహదారి (NH-65) పై కంకిపాడు దాటిన తర్వాత వచ్చే చలివేంద్రపాలెం నిలుస్తోంది. ఇక్కడ డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ పూర్తికావడంతో పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, కంటైనర్ రవాణా, గిడ్డంగులు ఈ బెల్ట్ మీదుగానే సాగాలి. ఇప్పటికే ఇక్కడ జాతీయ రహదారికి ఇరువైపులా ధరలు పెరిగినప్పటికీ, పోర్ట్ యాక్టివిటీ ఊపందుకుంటే హైదరాబాద్-ముంబై పారిశ్రామిక రవాణా కారిడార్‌గా చలివేంద్రపాలెం పరిసరాలు భారీ రాబడులను అందించే అవకాశాలు ఉన్నాయి.
Be the first to react