Amaravathi: నాలెడ్జ్ హబ్‌గా రూపుదిద్దుకుంటున్న అమరావతి.. జనవరిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు!
Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికతను రాజధానిలో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ క్వాంటం కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్.. భవన నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి నారాయణ..
డిసెంబర్ చివరి నాటికి క్వాంటం భవనం సిద్ధం.. జనవరిలో సేవలు ప్రారంభం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికతను రాజధానిలో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ క్వాంటం కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతి త్వరలో నాలెడ్జ్ హబ్‌గా మారుతుందని అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ సేవలను జనవరిలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
డిసెంబర్ నాటికి భవనం సిద్ధం
క్వాంటం కంప్యూటింగ్ కోసం నిర్మిస్తున్న భవనం పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. భవనం నిర్మాణం పూర్తయిన అనంతరం అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేసి జనవరిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
ఈ క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థను జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యాధునిక కంప్యూటింగ్ సాంకేతికత రాజధానిలో అందుబాటులోకి రావడం ద్వారా అమరావతి సాంకేతిక రంగంలో మరో ముందడుగు వేయనుందని తెలిపారు.
హైదరాబాద్ ఐటీ హబ్ తరహాలో అమరావతిలో క్వాంటం
హైదరాబాద్‌లో ఐటీ రంగం ఎలా అభివృద్ధి చెంది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందో, అదే తరహాలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికతకు ప్రత్యేక స్థానం కల్పించనున్నట్లు నారాయణ పేర్కొన్నారు. అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా సాంకేతికత, విద్య, పరిశోధనలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.
చంద్రబాబు దూరదృష్టితోనే ఐటీ రంగంలో తెలుగువారి దూకుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి కారణంగానే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ రంగంలో ముందుకు వెళ్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా అమరావతిలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికత రాజధానిలో అందుబాటులోకి వస్తే విద్యార్థులు, పరిశోధకులు, టెక్నాలజీ రంగ నిపుణులకు కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
Tags
Be the first to react
