Healthy Lifestyle Tips: రాగి సంగటి నుంచి చద్దన్నం వరకు.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Fatty Liver: చిన్నారుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్‌ సమస్య! అసలు కారణం ఇదేనా? Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం! Better Sleep: రాత్రి పూట నిద్ర పట్టడం లేదా? మీ డైట్‌లో ఈ ఐదు మార్పులు చేసుకోండి! AIIMS NAT System: మంగళగిరి ఎయిమ్స్‌లో సరికొత్త వైద్య విప్లవం... రూ.1.73 కోట్లతో NAT సిస్టం! Health Tips: ఖాళీ కడుపుతో అరటిపండు... ఆరోగ్యానికి లాభమా? నష్టమా? Sankar Foundation: శంకర్ ఫౌండేషన్ అరుదైన రికార్డు... 5.1 లక్షల కంటి ఆపరేషన్లు! పోలవరంలో పెద్దపులి కలకలం.... Watermelon Seeds: పుచ్చకాయ గింజలు మింగుతున్నారా? అయితే ఇవి తెలుసుకోండి.... Healthy Lifestyle Tips: రాగి సంగటి నుంచి చద్దన్నం వరకు.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Fatty Liver: చిన్నారుల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్‌ సమస్య! అసలు కారణం ఇదేనా? Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం! Better Sleep: రాత్రి పూట నిద్ర పట్టడం లేదా? మీ డైట్‌లో ఈ ఐదు మార్పులు చేసుకోండి! AIIMS NAT System: మంగళగిరి ఎయిమ్స్‌లో సరికొత్త వైద్య విప్లవం... రూ.1.73 కోట్లతో NAT సిస్టం! Health Tips: ఖాళీ కడుపుతో అరటిపండు... ఆరోగ్యానికి లాభమా? నష్టమా? Sankar Foundation: శంకర్ ఫౌండేషన్ అరుదైన రికార్డు... 5.1 లక్షల కంటి ఆపరేషన్లు! పోలవరంలో పెద్దపులి కలకలం.... Watermelon Seeds: పుచ్చకాయ గింజలు మింగుతున్నారా? అయితే ఇవి తెలుసుకోండి....

Healthy Lifestyle Tips: రాగి సంగటి నుంచి చద్దన్నం వరకు.. ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..!

Healthy Lifestyle Tips: మన పూర్వీకులు రాగి సంగటి, జొన్న రొట్టెలు, చద్దన్నం తిని ఎంతో కాలం ఆరోగ్యంగా ఉండేవారు. నేటి తరం ఎదుర్కొంటున్న మధుమేహం, బీపీ వంటి సమస్యలను అరికట్టడానికి మన సంప్రదాయ ఆహారపు అలవాట్లే సరైన పరిష్కారం. వీటి వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు

Published : 2026-04-09 11:30:00

Healthy Lifestyle Tips: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనకు ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గింది. కాస్త దూరం నడవాలన్నా ఆయాసం, చిన్న వయసులోనే షుగర్, బీపీ వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. కానీ మన తాతముత్తాతలు మాత్రం 80 ఏళ్లు వచ్చినా ఎంతో హుషారుగా ఉండేవారు. దానికి ప్రధాన కారణం వారు తీసుకునే సంప్రదాయ ఆహారం. పూర్వం గ్రామాల్లో ప్రతి ఇంట్లోనూ రాగి సంగటి, జొన్న రొట్టెలు, గంజి, చద్దన్నం వంటివే ప్రధాన భోజనం. ఇప్పుడు మళ్లీ మనం అదే బాట పట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పోషకాల గని - రాగులు

రాగులు చిన్నగా ఉన్నా, వాటిలో ఉండే శక్తి మాత్రం చాలా పెద్దది. ఇందులో క్యాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఎముకలు దృఢంగా ఉండటానికి, రక్తం పడటానికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. షుగర్ ఉన్నవారు రాగి జావ తాగితే గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు.

 శక్తినిచ్చే జొన్న రొట్టెలు

జొన్నల్లో ఉండే పీచు పదార్థం (ఫైబర్) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జొన్న రొట్టెలు తింటే మనకు త్వరగా ఆకలి వేయదు, దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా జొన్నలు కీలక పాత్ర పోషిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఇవి మనల్ని కాపాడతాయి.

 గంజి పేదవాడి అమృతం

అప్పట్లో బియ్యం వండిన తర్వాత వార్చిన గంజిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగేవారు. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. ఎండకాలంలో గంజి తాగడం వల్ల ఒంట్లోని వేడి తగ్గి, శరీరానికి చలువ చేస్తుంది. ఇందులో విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.

చద్దన్నం మహిమ

రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు లేదా పాలు పోసి, మర్నాడు పొద్దున్నే ఉల్లిపాయతో కలిపి తినడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను అద్భుతంగా మెరుగుపరుస్తుంది. నేటి తరం జంక్ ఫుడ్‌కు బానిస అవుతున్న తరుణంలో, మన పాత కాలపు చద్దన్నం తింటే గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. రుచి కోసం ప్రాసెస్ చేసిన ఆహారాల వెనక పరిగెత్తకుండా, మన పూర్వీకులు అందించిన ఈ సంప్రదాయ పదార్థాలను అలవాటు చేసుకుంటే డాక్టర్ల చుట్టూ తిరిగే పని ఉండదు. ఆరోగ్యంగా ఉండాలంటే మళ్లీ మన పాత అలవాట్లకు ప్రాణం పోయాల్సిందే!

Spotlight

Read More →