AIIMS NAT System: మంగళగిరి ఎయిమ్స్‌లో సరికొత్త వైద్య విప్లవం... రూ.1.73 కోట్లతో NAT సిస్టం! Health Tips: ఖాళీ కడుపుతో అరటిపండు... ఆరోగ్యానికి లాభమా? నష్టమా? Sankar Foundation: శంకర్ ఫౌండేషన్ అరుదైన రికార్డు... 5.1 లక్షల కంటి ఆపరేషన్లు! పోలవరంలో పెద్దపులి కలకలం.... Watermelon Seeds: పుచ్చకాయ గింజలు మింగుతున్నారా? అయితే ఇవి తెలుసుకోండి.... Breast Cancer: వయసు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ కు కారణం అదేనట... జాగ్రత్త! Healthy Drink: వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఈ డ్రింక్ తాగాల్సిందే! Almonds: బాదంపప్పును ఎప్పుడు తినాలి... ఎలా తినాలి! Natural Remedies: ఉదయాన్నే కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కా మీ కోసమే... Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరం ఇచ్చే హెచ్చరికలు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి! Walking: వేసవి వేడికి చెక్! వాకింగ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్... AIIMS NAT System: మంగళగిరి ఎయిమ్స్‌లో సరికొత్త వైద్య విప్లవం... రూ.1.73 కోట్లతో NAT సిస్టం! Health Tips: ఖాళీ కడుపుతో అరటిపండు... ఆరోగ్యానికి లాభమా? నష్టమా? Sankar Foundation: శంకర్ ఫౌండేషన్ అరుదైన రికార్డు... 5.1 లక్షల కంటి ఆపరేషన్లు! పోలవరంలో పెద్దపులి కలకలం.... Watermelon Seeds: పుచ్చకాయ గింజలు మింగుతున్నారా? అయితే ఇవి తెలుసుకోండి.... Breast Cancer: వయసు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ కు కారణం అదేనట... జాగ్రత్త! Healthy Drink: వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఈ డ్రింక్ తాగాల్సిందే! Almonds: బాదంపప్పును ఎప్పుడు తినాలి... ఎలా తినాలి! Natural Remedies: ఉదయాన్నే కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కా మీ కోసమే... Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరం ఇచ్చే హెచ్చరికలు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి! Walking: వేసవి వేడికి చెక్! వాకింగ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్...

AIIMS NAT System: మంగళగిరి ఎయిమ్స్‌లో సరికొత్త వైద్య విప్లవం... రూ.1.73 కోట్లతో NAT సిస్టం!

AIIMS NAT System: మంగళగిరి ఎయిమ్స్ రూ. 1.73 కోట్లతో ప్రతిష్టాత్మకమైన న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లికేషన్ టెస్టింగ్ (NAT) సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఇది రక్తంలోని అత్యంత సూక్ష్మమైన వైరస్‌లను సైతం వేగంగా గుర్తిస్తుంది. తద్వారా రక్త మార్పిడి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను అడ్డుకుని రోగుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తుంది. ఎయిమ్స్ తన వైద్య సేవలను మరింత ఆధునీకరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 2026-04-05 13:20:00

సురక్షితమైన రక్త మార్పిడికి సరికొత్త బాట.. ఎయిమ్స్‌లో న్యూక్లియిక్ యాసిడ్ టెస్టింగ్…

మంగళగిరి ఎయిమ్స్ ఘనత: ఇక క్షణాల్లో రక్త పరీక్షల నివేదికలు…

హెచ్ఐవీ, హెపటైటిస్ వైరస్‌లకు ఇక చెక్.. మంగళగిరి ఎయిమ్స్‌లో అధునాతన ల్యాబ్…

AIIMS NAT System: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్య రంగంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. రోగులకు మరింత మెరుగైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను అందించే లక్ష్యంతో ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ విభాగంలో అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చారు. సుమారు రూ. 1.73 కోట్ల భారీ వ్యయంతో "న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లికేషన్ టెస్టింగ్ (NAT) సిస్టం"ను ఇక్కడ ప్రారంభించారు. ఈ కొత్త వ్యవస్థ ఏర్పాటుతో రక్త పరీక్షల ప్రక్రియ మునుపటి కంటే వేగవంతం కావడమే కాకుండా, ఫలితాల్లో ఖచ్చితత్వం గణనీయంగా పెరుగుతుంది.

ముఖ్యంగా రక్త మార్పిడి సమయంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్ల ముప్పును ఈ పరికరం సమర్థవంతంగా నివారిస్తుంది. సాధారణ పరీక్షల్లో వెంటనే బయటపడని ప్రమాదకరమైన హెచ్ఐవీ (HIV), హెపటైటిస్-బి, మరియు హెపటైటిస్-సి వంటి వైరస్‌లను ఈ NAT సిస్టం ద్వారా ప్రాథమిక దశలోనే (విండో పీరియడ్‌లో ఉన్నప్పుడే) గుర్తించే వీలుంటుంది. దీనివల్ల రక్తం తీసుకునే రోగులకు పూర్తి సురక్షితమైన రక్తం అందుతుందని వైద్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చుకుంటూ మంగళగిరి ఎయిమ్స్ కోస్తా ఆంధ్ర ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను చేరువ చేస్తోంది.

Spotlight

Read More →