సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే! Scholarship: విద్యార్థులకు శుభవార్త! ఏటా రూ. 50,000 పొందే అవకాశం... జనవరి 20 వరకే గడువు! AP Schools: ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు కొత్త రూల్! 1 నుంచి 10 తరగతి వరకు... తప్పనిసరి! సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు గేట్‌వే…! CUET-UG 2026 డేట్స్ ఫిక్స్..! School Hoilday: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు సోమవారం కూడా సెలవు! ఏయే రాష్ట్రాల్లో అంటే? Sankranti Holidays: విద్యార్థులకు పండగే పండగ.. పెరిగిన సంక్రాంతి సెలవులు.. పూర్తి వివరాలు మీకోసం! Sankranti Holidays Update,: సంక్రాంతికి స్కూల్ పిల్లలకు పండగే పండగ..తాజా అప్డేట్!! Students Alert: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కొత్త రూల్స్..! ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి! Students: గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కార్ తీపికబురు..! రూ.100 కోట్ల స్కాలర్‌షిప్‌లు రిలీజ్! RRB Group D: రైల్వే అభ్యర్థులకు అలర్ట్..! గ్రూప్–డీ CBT–1 కొత్త తేదీలు విడుదల! సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే! Scholarship: విద్యార్థులకు శుభవార్త! ఏటా రూ. 50,000 పొందే అవకాశం... జనవరి 20 వరకే గడువు! AP Schools: ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు కొత్త రూల్! 1 నుంచి 10 తరగతి వరకు... తప్పనిసరి! సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు గేట్‌వే…! CUET-UG 2026 డేట్స్ ఫిక్స్..! School Hoilday: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు సోమవారం కూడా సెలవు! ఏయే రాష్ట్రాల్లో అంటే? Sankranti Holidays: విద్యార్థులకు పండగే పండగ.. పెరిగిన సంక్రాంతి సెలవులు.. పూర్తి వివరాలు మీకోసం! Sankranti Holidays Update,: సంక్రాంతికి స్కూల్ పిల్లలకు పండగే పండగ..తాజా అప్డేట్!! Students Alert: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కొత్త రూల్స్..! ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి! Students: గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కార్ తీపికబురు..! రూ.100 కోట్ల స్కాలర్‌షిప్‌లు రిలీజ్! RRB Group D: రైల్వే అభ్యర్థులకు అలర్ట్..! గ్రూప్–డీ CBT–1 కొత్త తేదీలు విడుదల!

సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు గేట్‌వే…! CUET-UG 2026 డేట్స్ ఫిక్స్..!

2025-12-29 12:12:00
IndiGo Airlines: ఇండిగో పట్టు సడలుతోందా? దేశీయ విమానయాన మార్కెట్‌లో కీలక మార్పు..!

దేశవ్యాప్తంగా ఉన్న 47 సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీయూఈటీ – యూజీ (CUET-UG) పరీక్షకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రతి ఏడాది బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీటెక్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి సీయూఈటీ యూజీ 2026 పరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయని, మే నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

Elon Musk: 8 గంటల వెయిటింగ్‌.. ప్రాణం పోయింది.. కెనడా హెల్త్‌కేర్‌పై ఎలాన్ మస్క్ ఫైర్!

సీయూఈటీ యూజీ 2026 పరీక్షలను దేశవ్యాప్తంగా మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను ఇప్పటికే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. త్వరలోనే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు తేదీలు, పరీక్ష షెడ్యూల్, సబ్జెక్ట్ ఎంపిక వంటి పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ ద్వారా వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే అవసరమైన సమాచారాన్ని తెలుసుకుని సిద్ధంగా ఉండాలని ఎన్‌టీఏ సూచించింది.

BSF Recruitment: పదో తరగతి అర్హతతో బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..! పరీక్షలేకుండానే ఎంపిక..!

దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన డాక్యుమెంట్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని యూజీసీ స్పష్టంగా సూచించింది. ముఖ్యంగా ఆధార్ కార్డులోని పేరు, పుట్టిన తేదీ, చిరునామా పదో తరగతి సర్టిఫికెట్‌లో ఉన్న వివరాలకు అనుగుణంగా ఉండాలని తెలిపింది. ఆధార్‌లో ఉన్న ఫొటో స్పష్టంగా లేకపోతే దానిని తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. దివ్యాంగ అభ్యర్థులు తమ యూడీఐడీ (UDID) కార్డు చెల్లుబాటులో ఉండేలా రెన్యువల్ చేయించుకొని తాజా వివరాలతో ఉంచుకోవాలని తెలిపింది. అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ–ఎన్‌సీఎల్ వంటి రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు తమ కేటగిరీ సర్టిఫికెట్లు చెల్లుబాటు అయ్యేలా అప్డేట్ చేసుకోవాలని సూచించింది.

Cigarettes: పొగ తాగేవారికి కేంద్రం కఠిన నిర్ణయం.. సిగరెట్ ఇక లగ్జరీ!

ఇక సీయూఈటీ యూజీ 2026 ఆన్‌లైన్ పరీక్షలను మే 13 నుంచి జూన్ 3వ తేదీ వరకు పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన తాజా అప్‌డేట్స్, నోటిఫికేషన్, దరఖాస్తు వివరాలు, అడ్మిట్ కార్డులు, ఫలితాల సమాచారం కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లు https://nta.ac.in మరియు https://cuet.nta.nic.inలను చెక్ చేసుకోవాలని సూచించింది. సెంట్రల్ యూనివర్సిటీల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఈ పరీక్ష ఎంతో కీలకమైనదిగా భావిస్తుండటంతో, సరైన ప్రణాళికతో ముందుగానే సిద్ధమవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

Train Fire: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం…! 71 ఏళ్ల వృద్ధుడు మృతి.!
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లపై ఊహించని షాక్! లక్షల మందికి ఇళ్లు రావు.. ఈ లిస్ట్‌లో మీరు పేరు ఉందేమో చెక్ చేసుకోండి!
గుంటూరులో ఆ పార్క్‌కు మహర్దశ.. రూ.18.35 కోట్లతో పునరుద్ధరణ!
Vijay Latest News: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కిందపడ్డ విజయ్…!!
AP Cabinet: చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం... కీలక అంశాలు!
ATM Scam: తస్మాత్ జాగ్రత్త! ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే రావడం లేదా... ఇదొక కొత్త రకం స్కాం!

Spotlight

Read More →