అమెరికా పౌరసత్వంపై ఉక్కుపాదం.. 40 మందికి షాక్‌! జాబితాలో భారతీయులు!

వాషింగ్టన్‌: అమెరికాలో సహజీకృత పౌరసత్వం పొందిన 40 మందిపై అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. పౌరసత్వం పొందే సమయంలో తప్పుడు వివరాలు సమర్పించడం, కీలక సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం, మోసపూరిత మార్గాలను ఆశ్రయించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిపై ‘డీ-న్యాచురలైజేషన్‌’ ప్రక్రియను ప్రారంభించింది. వీరిలో భారతీయుడైన బల్విందర్‌ సింగ్‌ కూడా ఉన్నారు. అమెరికా ఆధునిక చరిత్రలో ఇదే అతిపెద్ద డీ-న్యాచురలైజేషన్‌ చర్యగా న్యాయశాఖ అభివర్ణించింది.

అమెరికా పౌరసత్వంపై ఉక్కుపాదం.. 40 మందికి షాక్‌! జాబితాలో భారతీయులు!
us citizenship crackdown
  • అమెరికాలో 40 మంది సహజీకృత పౌరసత్వంపై న్యాయపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి.
  • ఆగస్టు 21 నుంచి అక్టోబర్‌ 2 మధ్య 19 ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టుల్లో 40 మందిపై సివిల్‌ కేసులు దాఖలయ్యాయి.

వాషింగ్టన్‌: అమెరికాలో సహజీకృత పౌరసత్వం పొందిన 40 మందిపై అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. పౌరసత్వం పొందే సమయంలో తప్పుడు వివరాలు సమర్పించడం, కీలక సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం, మోసపూరిత మార్గాలను ఆశ్రయించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిపై ‘డీ-న్యాచురలైజేషన్‌’ ప్రక్రియను ప్రారంభించింది. వీరిలో భారతీయుడైన బల్విందర్‌ సింగ్‌ కూడా ఉన్నారు. అమెరికా ఆధునిక చరిత్రలో ఇదే అతిపెద్ద డీ-న్యాచురలైజేషన్‌ చర్యగా న్యాయశాఖ అభివర్ణించింది.

ఆగస్టు 21 నుంచి అక్టోబర్‌ 2 మధ్య 19 ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టుల్లో ఈ 40 మందిపై సివిల్‌ కేసులు దాఖలయ్యాయి. వీరిపై గూఢచర్యం, హత్య, మనీలాండరింగ్‌, లైంగిక నేరాలు, పన్ను ఎగవేత, వివాహ మోసం తదితర తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్లు అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. కొందరు తమ గత నేర చరిత్రను దాచిపెట్టి పౌరసత్వం పొందినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.

అమెరికా అటార్నీ జనరల్‌ టాడ్‌ బ్లాంచ్‌ ప్రకారం.. పౌరసత్వం పొందేందుకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినా, ముఖ్యమైన వాస్తవాలను దాచినా ప్రభుత్వం ఉపేక్షించబోదు. పౌరసత్వ ప్రక్రియలో మోసాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ కేసుల జాబితాలో ఉన్న భారతీయుడు బల్విందర్‌ సింగ్‌పై అధికారులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన రెండు వేర్వేరు గుర్తింపులను ఉపయోగించినట్లు న్యాయశాఖ పేర్కొంది. 1992లో ఒక గుర్తింపుతో ఇమ్మిగ్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని, అనంతరం 2003లో మరో గుర్తింపుతో శాశ్వత నివాస హోదా పొందారని తెలిపింది. అదే రెండో గుర్తింపుతో 2009లో అమెరికా పౌరసత్వం పొందినట్లు ఆరోపించింది.

అయితే ఈ రెండు దరఖాస్తుల్లో నమోదైన వేలిముద్రలను అధికారులు పరిశీలించగా.. అవి ఒకే వ్యక్తికి చెందినవేనని గుర్తించినట్లు న్యాయశాఖ వెల్లడించింది. దీంతో బల్విందర్‌ సింగ్‌ పౌరసత్వం పొందిన విధానంపై ప్రశ్నలు తలెత్తాయి.

ఈ 40 మంది ఒక్క దేశానికి చెందినవారు కాదు. మెక్సికో, పాకిస్థాన్‌, చైనా, నేపాల్‌, ఇరాన్‌, నైజీరియా తదితర 20కి పైగా దేశాలకు చెందిన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నట్లు అమెరికా న్యాయశాఖ తెలిపింది.

వారిలో అమెరికా నౌకాదళ మాజీ సైనికుడు జిన్‌చావో వీ కూడా ఉన్నారు. చైనాకు గూఢచర్యం చేశారనే ఆరోపణలపై ఆయనకు 200 నెలల జైలు శిక్ష పడింది. మిగిలిన వారిపై కూడా పలు తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ చట్టం ప్రకారం.. మోసం, తప్పుడు సమాచారం లేదా కీలక విషయాలను దాచిపెట్టి సహజీకృత పౌరసత్వం పొందినట్లు కోర్టులో రుజువైతే ఆ పౌరసత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. పౌరసత్వం రద్దైన తర్వాత సంబంధిత వ్యక్తిపై ఇమ్మిగ్రేషన్‌ చట్టాల ప్రకారం డిపోర్టేషన్‌ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

అయితే ప్రస్తుతం ఈ 40 కేసులు విచారణ ప్రారంభ దశలోనే ఉన్నాయి. వారిపై వచ్చిన ఆరోపణలు కోర్టుల్లో రుజువు కావాల్సి ఉంది. తుది తీర్పుల అనంతరమే పౌరసత్వం రద్దు లేదా తదుపరి ఇమ్మిగ్రేషన్‌ చర్యలపై స్పష్టత రానుంది. దీంతో అమెరికా ప్రభుత్వం ప్రారంభించిన ఈ డీ-న్యాచురలైజేషన్‌ ప్రక్రియపై ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

Tags

Be the first to react

Latest