అమెరికాలో తెలుగు వ్యాపారవేత్తకు అరుదైన గుర్తింపు.. సంక్రాంతి కిచెన్ వ్యవస్థాపకుడికి గౌరవం!

Proud Moment for Telugu NRIs: అమెరికాలో తెలుగు పారిశ్రామికవేత్త శ్రీనివాస్ నిమ్మగడ్డకు అరుదైన గౌరవం లభించింది. సంక్రాంతి ఇండియన్ కిచెన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ నిమ్మగడ్డ (నిమ్స్)ను జార్జియా రాష్ట్ర ప్రభుత్వం ‘అవుట్‌స్టాండింగ్ జార్జియా సిటిజన్’గా గుర్తించింది. జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రాఫెన్స్‌పర్జర్ ఈ అవార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని నవంబర్ 12, 2026న జార్జియా స్టేట్ క్యాపిటల్‌లో ఆయనకు అందజేశారు. అమెరికా అంతటా, అంతర్జాతీయంగా జార్జియా రాష్ట్రానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా నిమ్మగడ్డ సేవలను ఈ సందర్భంగా గుర్తించారు. ఈ గౌరవం తనకు ఎంతో విలువైనదని శ్రీనివాస్ నిమ్మగడ్డ ఆనందం వ్యక్తం చేశారు.

Proud Moment for Telugu NRIs
Proud Moment for Telugu NRIs

అమెరికాలో తెలుగు పారిశ్రామికవేత్తకు అరుదైన గౌరవం.. ‘అవుట్‌స్టాండింగ్ జార్జియా సిటిజన్’గా శ్రీనివాస్ నిమ్మగడ్డ..

అమెరికాలో భారతీయ రుచులకు కొత్త గుర్తింపు.. సంక్రాంతి ఇండియన్ కిచెన్‌తో తెలుగోడి దూకుడు..

అట్లాంటా: అమెరికాలో తెలుగు పారిశ్రామికవేత్త శ్రీనివాస్ నిమ్మగడ్డకు అరుదైన గౌరవం లభించింది. సంక్రాంతి ఇండియన్ కిచెన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ నిమ్మగడ్డ (నిమ్స్)ను జార్జియా రాష్ట్ర ప్రభుత్వం ‘అవుట్‌స్టాండింగ్ జార్జియా సిటిజన్’గా గుర్తించింది. జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రాఫెన్స్‌పర్జర్ ఈ అవార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని నవంబర్ 12, 2026న జార్జియా స్టేట్ క్యాపిటల్‌లో ఆయనకు అందజేశారు. అమెరికా అంతటా, అంతర్జాతీయంగా జార్జియా రాష్ట్రానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా నిమ్మగడ్డ సేవలను ఈ సందర్భంగా గుర్తించారు. ఈ గౌరవం తనకు ఎంతో విలువైనదని శ్రీనివాస్ నిమ్మగడ్డ ఆనందం వ్యక్తం చేశారు.

సాధారణ స్థాయి నుంచి అంతర్జాతీయ వ్యాపారవేత్తగా ఎదిగిన నిమ్మగడ్డ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. 2001లో కనెక్టికట్‌లోని తన ఇంటి బేస్‌మెంట్‌లో వెన్సాయ్ టెక్నాలజీస్ అనే ఐటీ సంస్థను ప్రారంభించారు. చిన్న స్థాయిలో మొదలైన ఈ సంస్థను క్రమంగా విస్తరిస్తూ భారత్, దుబాయ్, ఖతార్‌లలో కార్యాలయాలు కలిగిన బహుళజాతి ఐటీ కంపెనీగా తీర్చిదిద్దారు. వ్యాపార రంగంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

ఐటీ రంగంలో విజయవంతమైన ప్రయాణం కొనసాగిస్తూనే భారతీయ ఆహార సంస్కృతిని అమెరికాలో మరింత విస్తరించాలనే ఆలోచనతో 2018లో తొలి సంక్రాంతి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సంక్రాంతి ఇండియన్ కిచెన్‌ను అభివృద్ధి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అమెరికాలోని ప్రజలకు అసలైన భారతీయ రుచులను తాజాగా, వేగంగా, సులభంగా అందించాలనే లక్ష్యంతో గత ఐదేళ్లుగా ఈ వ్యాపార నమూనాను అభివృద్ధి చేశారు.

భారతీయ వంటకాలకు కూడా అమెరికాలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) బ్రాండ్ ఉండాలన్నది తన ఆశయమని నిమ్మగడ్డ తెలిపారు. మెక్సికన్ ఆహారానికి చిపోటిల్, మెడిటరేనియన్ వంటకాలకు కావా వంటి బ్రాండ్లు ఉన్నట్లే, భారతీయ ఆహారానికి కూడా దేశవ్యాప్తంగా విస్తరించిన సంస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగానే సంక్రాంతి ఇండియన్ కిచెన్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. గతంలో తన తొలి సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లానని, ఇప్పుడు సంక్రాంతి బ్రాండ్‌ను అమెరికా అంతటా విస్తరించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

భారతీయ వంటకాలను క్విక్ సర్వీస్ రెస్టారెంట్ విధానంలో అందించడం అంత సులభమైన విషయం కాదు. సంప్రదాయ భారతీయ వంటకాల రుచిని కాపాడుతూనే, తక్కువ సమయంలో వినియోగదారులకు ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేకమైన నిర్వహణ వ్యవస్థ అవసరం. ఇందుకోసం నిమ్మగడ్డ ఐదేళ్లపాటు అనేక ప్రయోగాలు, పరీక్షలు నిర్వహించారు. ఆహార తయారీ, నాణ్యత, వేగవంతమైన సర్వీస్, రెస్టారెంట్ నిర్వహణ వంటి అంశాల్లో పటిష్టమైన విధానాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తోందని సంస్థ వెల్లడించింది.

ప్రస్తుతం అట్లాంటాలోని మిడ్‌టౌన్ ప్రాంతంలో సంక్రాంతి ఇండియన్ కిచెన్ ఒక క్విక్ సర్వీస్ రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. వ్యాపార విస్తరణలో భాగంగా రాబోయే కొన్ని వారాల్లో బక్‌హెడ్, డౌన్‌టౌన్ అట్లాంటా ప్రాంతాల్లో మరో రెండు రెస్టారెంట్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో అట్లాంటాలో భారతీయ ఆహారాన్ని ఇష్టపడే వారికి మరిన్ని ప్రాంతాల్లో సంక్రాంతి సేవలు అందుబాటులోకి రానున్నాయి.

రెస్టారెంట్లకే పరిమితం కాకుండా భారీ అంతర్జాతీయ కార్యక్రమాల్లోనూ సంక్రాంతి ఇండియన్ కిచెన్ తన సేవలను విస్తరిస్తోంది. అమెరికాలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటైన జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‌లో ప్రతి నెలా ఆహార సేవలు అందిస్తోంది. ఇక్కడ నిర్వహించే అంతర్జాతీయ సమావేశాలు, భారీ ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలకు అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాల నుంచి వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. అలాంటి వేదికపై భారతీయ వంటకాలను పరిచయం చేసే అవకాశం సంక్రాంతి బ్రాండ్‌కు లభిస్తోంది.

ఈ వేసవిలో అట్లాంటాలో నిర్వహించిన ఫిఫా ఫ్యాన్ ఫెస్టివల్‌లో కూడా సంక్రాంతి ఇండియన్ కిచెన్ ప్రత్యేకంగా సేవలందించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన వేలాది మంది సందర్శకులకు భారతీయ వంటకాలను అందించింది. అంతర్జాతీయ క్రీడా వేడుకకు వచ్చిన అభిమానులకు భారతీయ ఆహార రుచులను పరిచయం చేయడం ద్వారా సంస్థ తన బ్రాండ్‌కు మరింత గుర్తింపు తెచ్చుకుంది.

ఇక వ్యాపార విస్తరణలో తదుపరి అడుగుగా 2027 నుంచి ఫ్రాంచైజీ విధానాన్ని ప్రారంభించాలని సంక్రాంతి ఇండియన్ కిచెన్ యోచిస్తోంది. దీని ద్వారా జార్జియా రాష్ట్రం దాటి పొరుగు రాష్ట్రాల్లోనూ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సరైన నిర్వహణ వ్యవస్థ, ఒకే విధమైన ఆహార నాణ్యత, వేగవంతమైన సేవలతో భారతీయ ఆహార బ్రాండ్‌ను అమెరికా మార్కెట్‌లో విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

మొత్తంగా ఐటీ రంగంలో చిన్న స్థాయి నుంచి అంతర్జాతీయ సంస్థను నిర్మించిన శ్రీనివాస్ నిమ్మగడ్డ, ఇప్పుడు భారతీయ ఆహార సంస్కృతిని అమెరికా ప్రధాన స్రవంతిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జార్జియా రాష్ట్రం నుంచి లభించిన ‘అవుట్‌స్టాండింగ్ జార్జియా సిటిజన్’ గుర్తింపు ఆయన వ్యాపార ప్రయాణానికి మరో మైలురాయిగా నిలిచింది. ఒకవైపు తెలుగు పారిశ్రామికవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతూనే, మరోవైపు భారతీయ రుచులకు అమెరికాలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఆయన లక్ష్యం ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా తెలుగు పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిస్తోంది.

Tags

Be the first to react

Latest