అమెరికా డ్రీమ్‌కు ఎండ్ కార్డ్? హెచ్‌-1బీ వీసాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న కొత్త రూల్స్... ట్రంప్ మార్క్ స్కెచ్!

H1B Visa update: హెచ్‌-1బీ వీసా వ్యవస్థపై అమెరికా ప్రభుత్వం తన కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. కొన్ని హెచ్‌-1బీ వీసా ద‌ర‌ఖాస్తుల‌పై 100,000 డాలర్ల (సుమారు రూ.95ల‌క్ష‌లు) భారీ ఫీజు విధించాలన్న తమ యంత్రాంగం నిర్ణయాన్ని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గట్టిగా సమర్థించుకున్నారు.

అమెరికా డ్రీమ్‌కు ఎండ్ కార్డ్? హెచ్‌-1బీ వీసాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న కొత్త
అమెరికా డ్రీమ్‌కు ఎండ్ కార్డ్? హెచ్‌-1బీ వీసాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న కొత్త రూల్స్... ట్రంప్ మార్క్ స్కెచ్!
  • USA: హెచ్‌-1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజును సమర్థించిన యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్..

  • కాంగ్రెస్‌లో మద్దతు లేనందునే ఫీజు వంటి పరిపాలనాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి..

America: అమెరికాలో ఉద్యోగాలు, వీసా విధానాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం తన కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. విదేశీ నిపుణులు ఎంతో ఆశగా ఎదురుచూసే హెచ్‌-1బీ (H-1B) వీసా వ్యవస్థపై సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొన్ని హెచ్‌-1బీ వీసా దరఖాస్తులపై ఏకంగా 1,00,000 అమెరికన్ డాలర్ల (సుమారు రూ. 95 లక్షలు) వరకు భారీ ఫీజు విధించాలన్న నిర్ణయాన్ని యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గట్టిగా సమర్థించుకున్నారు.

"అమెరికన్లను తొలగించి విదేశీయులను తెచ్చుకోవడానికి వీసా కాదు"

ఇటీవల ప్రసిద్ధ 'ఆల్-ఇన్ పాడ్‌కాస్ట్' (All-In Podcast) లో పాల్గొన్న జేడీ వాన్స్, హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్ వెనుక ఉన్న మూల ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించారు.

తక్కువ జీతాల భర్తీపై అభ్యంతరం: "తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ నిపుణులతో స్థానిక అమెరికన్ ఉద్యోగులను భర్తీ చేయడానికి హెచ్‌-1బీ వీసా విధానం రూపుదిద్దుకోలేదు. కేవలం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అత్యున్నత నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే ఆకర్షించడం దీని ప్రాథమిక లక్ష్యం" అని వాన్స్ వ్యాఖ్యానించారు.

ఉదాహరణతో స్పష్టత: ఈ విధానాన్ని అర్థమయ్యేలా వివరిస్తూ.. ఒక అమెరికన్ అకౌంటెంట్ ఏడాదికి $60,000 వేతనం తీసుకుంటుంటే, ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించి, అదే స్థానంలో విదేశీ ఉద్యోగిని $45,000 కే నియమించుకోవడం హెచ్‌-1బీ వీసా ఉద్దేశం కాకూడదని చెప్పారు. ఐటీ మరియు ఇతర రంగాలు నిజమైన అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించడానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

చట్టపరమైన మార్పులు కష్టం.. అందుకే ఫీజుల పెంపు చర్యలు..
హెచ్‌-1బీ వీసా చట్టాల్లో పూర్తిస్థాయి చట్టపరమైన మార్పులు తీసుకురావడానికి అమెరికా కాంగ్రెస్‌లో (పాల్లమెంట్) తగినంత రాజకీయ సంకల్పం కొరవడిందని జేడీ వాన్స్ అంగీకరించారు. అందుకే తమ యంత్రాంగం ఫీజుల పెంపు వంటి పరిపాలనాపరమైన నిబంధనల ద్వారా ఈ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

లేఆఫ్స్ ఇచ్చే కంపెనీలపై కఠిన ఆంక్షల ఆలోచన..
టెక్ పరిశ్రమలో పెద్ద ఎత్తున అమెరికన్ కార్మికులను తొలగించి (Layoffs), ఆ వెంటనే తీవ్రమైన కార్మికుల కొరత ఉందనే నెపంతో హెచ్‌-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసే కంపెనీల తీరుపై ప్రభుత్వం నిఘా ఉంచిందని వాన్స్ హెచ్చరించారు.

సరిపడా అమెరికన్ ఉద్యోగులను తొలగించిన సంస్థలు మళ్లీ హెచ్‌-1బీ వీసాలు పొందకుండా అడ్డుకునే దిశగా కొత్త మార్గాలను తమ యంత్రాంగం పరిశీలిస్తోందని వెల్లడించారు. అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్న నేపథ్యంలో జేడీ వాన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులు మరియు దిగ్గజ టెక్ కంపెనీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Tags

Be the first to react

Latest