Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Iran issues : అమెరికా జోక్యం సహించం... ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్! Trump: రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ ఉగ్రరూపం.. భారత్ చైనా పై భారీ సుంకాలు! War Alert: వెనుజ్వేలాపై రెండో దాడికి సిద్ధం...! ట్రంప్ సంచలన హెచ్చరిక! Venezuela People : వెనిజులాలో స్వేచ్ఛా గడియలు మొదలా.. మదురో అరెస్ట్‌పై ప్రజల సంబరం! Global Tension: వెనెజులాపై అమెరికా దాడి..! యూఎన్ సమావేశానికి డిమాండ్! H-1B Shock: హెచ్‌–1బీ వీసా ఇక సులువు కాదు…! లక్ష డాలర్ల ఫీజుతో కొత్త నియమాలు! Illegal Immigrants: అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్…! దేశం వదిలితే రూ.2.7 లక్షలు + ఫ్రీ ఫ్లైట్! Mandarin Oriental: లగ్జరీ అనుభూతి అంటే ఇదే మరి... దుబాయ్ మాండరిన్ ఓరియెంటల్ హోటల్ ప్రత్యేకత! USA Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెట్టింగ్ వేళ మరో పిడుగు.. భారీగా H-IB, H-4 వీసాలు 'రద్దు'.! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Iran issues : అమెరికా జోక్యం సహించం... ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్! Trump: రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ ఉగ్రరూపం.. భారత్ చైనా పై భారీ సుంకాలు! War Alert: వెనుజ్వేలాపై రెండో దాడికి సిద్ధం...! ట్రంప్ సంచలన హెచ్చరిక! Venezuela People : వెనిజులాలో స్వేచ్ఛా గడియలు మొదలా.. మదురో అరెస్ట్‌పై ప్రజల సంబరం! Global Tension: వెనెజులాపై అమెరికా దాడి..! యూఎన్ సమావేశానికి డిమాండ్! H-1B Shock: హెచ్‌–1బీ వీసా ఇక సులువు కాదు…! లక్ష డాలర్ల ఫీజుతో కొత్త నియమాలు! Illegal Immigrants: అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్…! దేశం వదిలితే రూ.2.7 లక్షలు + ఫ్రీ ఫ్లైట్! Mandarin Oriental: లగ్జరీ అనుభూతి అంటే ఇదే మరి... దుబాయ్ మాండరిన్ ఓరియెంటల్ హోటల్ ప్రత్యేకత! USA Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెట్టింగ్ వేళ మరో పిడుగు.. భారీగా H-IB, H-4 వీసాలు 'రద్దు'.!

H-1B Shock: హెచ్‌–1బీ వీసా ఇక సులువు కాదు…! లక్ష డాలర్ల ఫీజుతో కొత్త నియమాలు!

2025-12-25 10:55:00
Air Pollution: అత్యవసర పరిస్థితిలోనూ నిర్ణయం లేదా? జీఎస్టీ కౌన్సిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఫైర్!


అమెరికాలో స్థిరపడాలన్న కలలతో హెచ్‌–1బీ (H-1B) వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరోసారి పెద్ద షాక్ ఇచ్చింది. కొత్త హెచ్‌–1బీ వీసా దరఖాస్తులపై ఏకంగా 1 లక్ష డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.85 లక్షలు) ఫీజుగా వసూలు చేయడానికి ఫెడరల్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ భారీ ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫెడరల్ న్యాయమూర్తి బెరిల్ హోవెల్ తిరస్కరించారు. జాతీయ భద్రత, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా ఇలాంటి విధాన నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం అధ్యక్షుడికే ఉందని కోర్టు స్పష్టం చేసింది.

KV Update: విద్యార్థులకు గుడ్ న్యూస్…! ఆ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం ఫిక్స్…!

ప్రస్తుతం హెచ్‌–1బీ వీసాకు దరఖాస్తు ఫీజులు 2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్ల మధ్యలోనే ఉన్నాయి. అయితే వాటిని ఒక్కసారిగా లక్ష డాలర్ల వరకు పెంచడం వల్ల అమెరికాలోని చిన్న, మధ్యతరహా ఐటీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విదేశీ టెక్నికల్ టాలెంట్‌ను నియమించుకోవడం చిన్న కంపెనీలకు అసాధ్యంగా మారుతుందని వాణిజ్య మండళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, అమెరికా పౌరులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్న ట్రంప్ ప్రభుత్వం లక్ష్యానికి ఈ నిర్ణయం అనుకూలంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

Tirumala: స్థానిక భక్తులకు టీటీడీ బిగ్ గిఫ్ట్…! వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్ స్టార్ట్…!

ఫీజుల పెంపుతో పాటు హెచ్‌–1బీ వీసాల ఎంపిక విధానంలోనూ కీలక మార్పులు తీసుకురానున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న లాటరీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, దాని స్థానంలో వెయిటెడ్ సెలక్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇకపై అత్యధిక నైపుణ్యాలు కలిగి, అధిక వేతనం పొందే అభ్యర్థులకే వీసాలు దక్కేలా ఈ విధానం రూపొందించబడుతోంది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 26 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Amazon Expansion: నిరుద్యోగులకు పండగే పండగ! అమెజాన్ భారీ విస్తరణ.. 833 మందికి ఉద్యోగాలు!

ఈ కోర్టు తీర్పుపై అమెరికా ఐటీ కంపెనీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయాల వల్ల అమెరికా టెక్నాలజీ రంగం గ్లోబల్ పోటీలో వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఫీజుల పెంపు వల్ల ప్రతిభావంతులైన విదేశీ నిపుణులు ఇతర దేశాల వైపు మళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నాయి. ఈ తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లేందుకు పలు సంస్థలు సిద్ధమవుతున్నాయి. డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాలు, కార్మిక సంఘాలు కూడా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిలవడంతో, ఈ వివాదం చివరకు అమెరికా సుప్రీంకోర్టుకు చేరే అవకాశముందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
 

Christmas Mass 2025: వాటికన్ సిటీ నుంచి ప్రపంచానికి శాంతి పిలుపు.. పోప్ లియో XIV తొలి క్రిస్మస్!!
Anganwadi Jobs: అంగన్వాడీ పోస్టుల భర్తీ.. డిసెంబర్ 31 వరకు గడువు! పది పాసైతే చాలు... మీ ఊర్లోనే ఉద్యోగం!
Indian Passport: భారత పాస్‌పోర్ట్‌పై టెకీ ఆవేదన.. ఇక విలువ లేదంటూ సంచలన వ్యాఖ్యలు!
Navi Mumbai Airport: నవి ముంబై విమానాశ్రయం ప్రారంభం.. తొలి విమానం ల్యాండింగ్‌తో చరిత్రాత్మక ఘట్టం!!
District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...?
Bus Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొని బస్సు దగ్ధం! 17 మంది మృతి!

Spotlight

Read More →