సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం పునరాభివృద్ధి పనులు జోరుగా సాగుతున్న నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబరు 19వ తేదీ వరకు కొన్ని ప్రధాన రైళ్లను సికింద్రాబాద్ స్టేషన్‌కు బదులుగా ఇతర స్టేషన్లకు మళ్లించనున్నారు. ఈ మేరకు పలు రైళ్ల రూట్లు తాత్కాలికంగా మార్చడం జరిగింది. విజయవాడ నుంచి వచ్చే 12713, 12714 రైళ్లు కాచిగూడ స్టేషన్‌కు, పోరుబందర్ వీక్లీ రైళ్లు ఉందానగర్‌కు, సిద్దిపేట రైళ్లు మల్కాజ్‌గిరికి మళ్లించబడ్డాయి.
అలానే, పుణె నుంచి నడిచే 12025, 12026 రైళ్లు హైదరాబాద్ ( నాంపల్లి) స్టేషన్ నుంచి నడుస్తాయి. మణుగూరు, రేపల్లె నుంచి వచ్చే రైళ్లు చర్లపల్లి స్టేషన్ నుంచి మళ్లించబడ్డాయి. అంతేకాక, సిల్చార్, దర్భంగ, యశ్వంత్‌పూర్, అగర్తల, ముజఫర్‌పూర్, సంత్రాగచి, దనపూర్, రామేశ్వరం వంటి దూర ప్రాంతాల రైళ్లను కూడా చర్లపల్లి టెర్మినల్ నుంచి నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు నంబర్లు, మారిన స్టేషన్లను పరిశీలించి ముందస్తుగా సర్దుబాటు చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.