Qatar Airways: ఖతార్ ఎయిర్‌వేస్ సంచలనం: 17 గంటల ఏకధాటి ప్రయాణంతో కొత్త విమాన మార్గాలు! Srisailam Accident: శ్రీశైలం టోల్ గేట్ వద్ద వాహన బీభత్సం... భక్తులపైకి దూసుకెళ్లిన కారు! APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో వస్తువులు మరిచిపోయారా? ఇక టెన్షన్ వద్దు.. కొత్త సిస్టమ్ రెడీ! IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ.14,500 కే అవి అన్నీ చుట్టిరావచ్చు! Air India: ఫుకెట్ ఎయిర్‌పోర్టులో కలకలం..! టైర్ ఊడటంతో అదుపుతప్పిన విమానం! PAN-PAN: 'పాన్-పాన్' అలర్ట్ జారీ చేసిన పైలట్లు... ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్! Road Accident: మామండూరు వద్ద ఘోర ప్రమాదం... సమయస్ఫూర్తితో ఐదుగురిని కాపాడిన 108 సిబ్బంది! Amrit Bharat Express: రైల్వే రంగంలో కొత్త విప్లవం... ఇకనుండి ఆ రూట్లో కూడా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్! Stop Sign: రోడ్డుపై స్టాప్ సైన్ ఎందుకు ఎనిమిది కోణాల్లో ఉంటుందో మీకు తెలుసా? Ongole Highway: ఒంగోలు హైవేపై ఘోర ప్రమాదం! 108 సిబ్బంది సమయస్ఫూర్తితో ఐదుగురు సేఫ్! Qatar Airways: ఖతార్ ఎయిర్‌వేస్ సంచలనం: 17 గంటల ఏకధాటి ప్రయాణంతో కొత్త విమాన మార్గాలు! Srisailam Accident: శ్రీశైలం టోల్ గేట్ వద్ద వాహన బీభత్సం... భక్తులపైకి దూసుకెళ్లిన కారు! APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో వస్తువులు మరిచిపోయారా? ఇక టెన్షన్ వద్దు.. కొత్త సిస్టమ్ రెడీ! IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ.14,500 కే అవి అన్నీ చుట్టిరావచ్చు! Air India: ఫుకెట్ ఎయిర్‌పోర్టులో కలకలం..! టైర్ ఊడటంతో అదుపుతప్పిన విమానం! PAN-PAN: 'పాన్-పాన్' అలర్ట్ జారీ చేసిన పైలట్లు... ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్! Road Accident: మామండూరు వద్ద ఘోర ప్రమాదం... సమయస్ఫూర్తితో ఐదుగురిని కాపాడిన 108 సిబ్బంది! Amrit Bharat Express: రైల్వే రంగంలో కొత్త విప్లవం... ఇకనుండి ఆ రూట్లో కూడా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్! Stop Sign: రోడ్డుపై స్టాప్ సైన్ ఎందుకు ఎనిమిది కోణాల్లో ఉంటుందో మీకు తెలుసా? Ongole Highway: ఒంగోలు హైవేపై ఘోర ప్రమాదం! 108 సిబ్బంది సమయస్ఫూర్తితో ఐదుగురు సేఫ్!

Medaram Jatara: మేడారం జాతరకు నేటి నుంచే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..!!

Medaram Jatara: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ నేటి నుంచి 4 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల నుంచి బస్సులు అందుబాటులో ఉండగా, తాత్కాలిక బస్‌స్టాండ్, భద్రత, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.

Published : 2026-01-25 08:44:00

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. నేటి నుంచే మేడారం జాతరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు నాలుగు వేల ప్రత్యేక బస్సులు భక్తులను మేడారం వరకు చేరవేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఫిబ్రవరి 1వ తేదీ వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

జాతర సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశముండటంతో మేడారం పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక బస్‌స్టాండ్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ బస్‌స్టాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు బస్‌స్టాండ్‌లో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయాణికులను నిర్వహించేందుకు 50 క్యూలైన్లను ఏర్పాటు చేయగా, బస్సుల పార్కింగ్ కోసం 25 ఎకరాలకుపైగా స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ దాదాపు వెయ్యి బస్సులు పార్కింగ్ చేయవచ్చని అధికారులు తెలిపారు.

భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తాత్కాలిక బస్‌స్టాండ్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. జాతర విధుల్లో 10 వేల మందికి పైగా ఆర్టీసీ సిబ్బంది పనిచేయనున్నారు. ప్రయాణికులకు తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్సతో కూడిన వైద్య శిబిరాలు అందుబాటులో ఉంచారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, భక్తులు సురక్షితంగా గద్దెల వద్దకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులే ఉత్తమ మార్గమని తెలిపారు. స్వంత వాహనాలతో వస్తే దూరంగా పార్కింగ్ చేయాల్సి ఉండటంతో పాటు ఎక్కువ నడక తప్పదన్నారు. ఆర్టీసీ బస్సులు నేరుగా జాతర ప్రాంతానికి సమీపంలోనే దించుతాయని, అందువల్ల వృద్ధులు, మహిళలు, పిల్లలకు ఎలాంటి అసౌకర్యం ఉండదని చెప్పారు. అవసరమైతే మరిన్ని బస్సులను కూడా వెంటనే రంగంలోకి దించేలా శాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కొనసాగుతుందని తెలిపారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ, మేడారం జాతర వంటి మహత్తర కార్యక్రమానికి శాశ్వత రవాణా మౌలిక వసతులు అవసరమని పేర్కొన్నారు. గతంలో ప్రతి జాతర సమయంలో తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులు ఇబ్బందులు పడిన సందర్భాలను గుర్తు చేస్తూ, దీర్ఘకాలిక పరిష్కారంగా శాశ్వత ఆర్టీసీ బస్‌స్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఏటూరునాగారంలో రూ.7 కోట్ల వ్యయంతో ఆర్టీసీ బస్ డిపోకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ డిపో ద్వారా అటవీ ప్రాంతాలు, భద్రాచలం, మంగపేట, వాజేడు, వెంకటాపురం వంటి ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించవచ్చని చెప్పారు.

ప్రభుత్వం లక్ష్యం భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరలో పాల్గొని సురక్షితంగా స్వస్థలాలకు చేరుకోవడమేనని మంత్రులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భక్తులంతా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వినియోగించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Spotlight

Read More →