టాలీవుడ్‌లో హీరోయిన్ సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'ఏ మాయ చేశావే'తో తెరంగేట్రం చేసిన ఆమె, తొలి సినిమాతోనే హిట్ కొట్టి స్టార్‌డమ్‌ను అందుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్‌షేర్ చేసుకుంది. తెలుగు తోపాటు తమిళంలోనూ మంచి గుర్తింపు సంపాదించింది.
కెరీర్ పరంగా విజయాలు అందుకున్న సమంత, వ్యక్తిగత జీవితంలో మాత్రం కాస్త తడబడింది. నాగ చైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నా, తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలతో విడిపోయారు. విడాకుల తర్వాత చైతూ మళ్లీ పెళ్లి చేసుకోగా, సమంత మాత్రం స్వతంత్ర జీవితాన్ని కొనసాగిస్తోంది.
విడాకుల తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంతకు అక్కడ కూడా మంచి ఆదరణ లభించింది. ఇటీవల ఆమె 15 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ – తన కెరీర్‌లోని తీపి చేదు క్షణాలను గుర్తు చేసుకుంది. “జీవితంలో కొన్ని సంఘటనలు మర్చిపోవాలనుకున్నా, మిగిలిపోతాయి.. మరికొన్ని మనం అనుకున్నదానికంటే త్వరగా మర్చిపోతాం” అని భావోద్వేగంగా పోస్ట్ చేశారు.
తాను మళ్లీ సినిమాల్లోకి రావడానికి కారణం ఒకే ఒకరేనంటూ పేర్కొంది – అతనే రాహుల్ రవీంద్రన్. మయోసైటిస్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న సమయంలో, రాహుల్ ప్రతి రోజు ఆమెను కలిసి, గేమ్స్ ఆడి మనసు హాయిగా చేసేవారని చెప్పారు. ఆ సమయంలో తనను మళ్లీ సినిమాల్లోకి రావాలని ప్రోత్సహించిన వ్యక్తి రాహూలేనని సమంత పేర్కొంది. ఓ ఈవెంట్‌లో అయితే స్టేజి మీదే “I love you” అని స్నేహపూర్వకంగా కూడా చెప్పారు.
రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా ‘చి.ల.సౌ.’ వంటి క్లాస్ హిట్ అందించగా, నటుడిగా ‘అందాల రాక్షసి’తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. వీరిద్దరూ తమ మొదటి సినిమా నుంచే స్నేహితులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ స్నేహం అలాగే కొనసాగుతోంది.