విమానాల భద్రతపై సోనూసూద్ సంచలన కామెంట్!

Flydubai Incident: ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటనపై నటుడు సోనూసూద్ స్పందించారు. విమానయాన భద్రతలో భాగంగా కాక్పిట్ తలుపుల విషయంలో అదనపు అత్యవసర భద్రతా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడంపై ఆలోచించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ఓ పోస్టు చేశారు.

Sonu Sood reacts on Flydubai Incident
Sonu Sood reacts on Flydubai Incident
  • విమాన భద్రత ఎప్పటికప్పుడు మెరుగుపడాలి అని సోనూసూద్ పేర్కొన్నారు.
  • ఫ్లైదుబాయ్ ఘటన నేపథ్యంలో కాక్పిట్ యాక్సెస్ ప్రోటోకాల్స్‌పై మరింత భద్రత అవసరమా? అనే చర్చ మొదలైంది.

Flydubai Incident: ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటనపై నటుడు సోనూసూద్ స్పందించారు. విమానయాన భద్రతలో భాగంగా కాక్పిట్ తలుపుల విషయంలో అదనపు అత్యవసర భద్రతా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడంపై ఆలోచించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ఓ పోస్టు చేశారు.

విమానయాన భద్రత అనేది ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందాల్సిన అంశమని సోనూసూద్ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కాక్పిట్‌లో ఉన్న పైలట్లు తలుపు తెరవలేని పరిస్థితి ఏర్పడితే.. బయట ఉన్న సిబ్బంది సహాయం చేసేలా ప్రత్యామ్నాయ భద్రతా చర్యలను పరిశీలించాలని కోరారు.

కాక్పిట్ తలుపు తెరవడానికి అవసరమైన అత్యవసర కోడ్‌ను బయట ఉన్న విశ్వసనీయ సిబ్బందిలో ఒకరి వద్ద భద్రంగా ఉంచే విధానాన్ని పరిశీలించవచ్చని సూచించారు. అయితే, ఆ కోడ్‌ను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించేలా కఠినమైన భద్రతా నిబంధనలు ఉండాలని స్పష్టం చేశారు.

ఇటీవల దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు బయల్దేరిన ఫ్లైదుబాయ్ విమానంలో కాక్పిట్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో విమానాన్ని సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు సమాచారం. విమానంలోని కోపైలట్ కెప్టెన్‌పై దాడికి ప్రయత్నించడంతోపాటు, విమానాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించినట్లు వచ్చిన వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి.

ఈ ఘటన నేపథ్యంలో కాక్పిట్ భద్రత, అత్యవసర సమయాల్లో పైలట్లకు అందే సహాయం, విమాన సిబ్బందికి ఉండాల్సిన ప్రత్యామ్నాయ భద్రతా వ్యవస్థలపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ తన సూచనలను వెల్లడించారు.

Tags

Be the first to react

Latest