డిసెంబర్‌లో టూర్‌కు ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 అద్భుతమైన ప్రదేశాలు చూసేయండి..

Tourist places in India: డిసెంబర్ నెల వచ్చేస్తోంది. ఏడాది చివర్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులు రావడంతో పర్యటనలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతుంది. చల్లని వాతావరణం, మంచుతో కప్పుకున్న కొండలు, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి డిసెంబర్ మంచి సమయం. మరి ఈ నెలలో సందర్శించదగిన అందమైన పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

Top 5 Best Places to Visit in India in December
Top 5 Best Places to Visit in India in December
  • డిసెంబర్ టూర్‌కు 5 అద్భుతమైన ప్రాంతాలను సందర్శించవచ్చు.
  • మంచు అందాలు, చల్లని వాతావరణం, ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఈ ప్రాంతాలు మంచి ఎంపిక.

Tourist places in India: డిసెంబర్ నెల వచ్చేస్తోంది. ఏడాది చివర్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులు రావడంతో పర్యటనలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతుంది. చల్లని వాతావరణం, మంచుతో కప్పుకున్న కొండలు, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి డిసెంబర్ మంచి సమయం. మరి ఈ నెలలో సందర్శించదగిన అందమైన పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

1. ధనౌల్తీ – ప్రకృతి అందాలకు చిరునామా

ఉత్తరాఖండ్‌లోని ధనౌల్తీ అందమైన హిల్‌స్టేషన్లలో ఒకటి. చుట్టూ ఎత్తైన పర్వతాలు, పచ్చని లోయలు, ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ నేచర్ వాక్, ట్రెక్కింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్‌తో పాటు అందమైన పార్కులను సందర్శించవచ్చు. హిమాలయ పర్వతాల అందాలను దగ్గరగా చూడాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.

2. ధర్మశాల – కొండల మధ్య ఆహ్లాదకరమైన ప్రయాణం

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల ప్రకృతి ప్రేమికులకు చక్కని పర్యాటక ప్రాంతం. ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, చల్లని వాతావరణం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. ఇక్కడి భాగ్‌సునాగ్ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే ధరం కోట్ ప్రాంతం పిక్నిక్‌లకు అనువైన ప్రదేశంగా గుర్తింపు పొందింది.

3. గుల్మార్గ్ – మంచు అందాలను ఆస్వాదించాలంటే!

కశ్మీర్‌లోని గుల్మార్గ్ డిసెంబర్‌లో సందర్శించడానికి అద్భుతమైన ప్రాంతం. నవంబర్ చివరి వారం నుంచే ఇక్కడ మంచు కురవడం ప్రారంభమవుతుంది. మంచుతో కప్పుకున్న రహదారులు, పర్వతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. స్కీయింగ్, స్కేటింగ్ వంటి సాహస క్రీడలు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. అంతేకాకుండా మంచు కొండల మధ్య కేబుల్ కార్ ప్రయాణం మరపురాని అనుభూతిని అందిస్తుంది.

శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ సుమారు 51 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జమ్మూ నుంచి దాదాపు 320 కిలోమీటర్ల దూరంలో ఉంది.

4. షిమ్లా – చలికాలపు అందాలకు కేరాఫ్

హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లా పర్యాటకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణే. ముఖ్యంగా డిసెంబర్‌లో చల్లని వాతావరణం, మంచు అందాలు పర్యటనను మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలనుకునేవారు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

5. మనాలి – మంచు కొండల మధ్య మధురమైన అనుభూతి

డిసెంబర్‌లో సందర్శించదగిన మరో అందమైన ప్రాంతం మనాలి. మంచుతో కప్పుకున్న పర్వతాలు, ప్రకృతి అందాలు, చల్లని వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలనుకునేవారికి మనాలి మంచి ఎంపిక.

మొత్తంగా.. ఈ డిసెంబర్‌లో సాధారణ పర్యటనకు భిన్నంగా మంచు అందాలు, కొండలు, ప్రకృతి ఒడిలో కొంత సమయం గడపాలనుకుంటే ఈ ఐదు ప్రాంతాలను మీ ట్రావెల్ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. అయితే మంచు, వాతావరణ పరిస్థితులు, ప్రయాణ సౌకర్యాలను ముందుగానే తెలుసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.

Tags

Be the first to react

Latest