రిచ్‌మండ్‌లో గ్రేటర్ తెలుగు అసోసియేషన్ లేడీస్ నైట్.. ఆటపాటలతో సందడి..

Greater Richmond Telugu Association: అమెరికాలోని గ్రేటర్ రిచ్‌మండ్ తెలుగు అసోసియేషన్ (GRTA) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లేడీస్ నైట్’ (Ladies Night) వేడుకలు ఘనంగా జరిగాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు, కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదభరితమైన వేడుకలతో సాయంత్రం అంతా ఉత్సాహంగా గడిచింది. కార్యక్రమానికి హాజరైన వారంతా వివిధ కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొంటూ వేడుకలను ఆనందంగా ఆస్వాదించారు.

Greater Richmond Telugu Association
Greater Richmond Telugu Association

రిచ్‌మండ్‌లో ఘనంగా GRTA ‘లేడీస్ నైట్’ వేడుకలు.. ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు మహిళలు..

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట.. రిచ్‌మండ్‌లో GRTA ప్రత్యేక వేడుకలు..

అమెరికాలోని గ్రేటర్ రిచ్‌మండ్ తెలుగు అసోసియేషన్ (GRTA) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లేడీస్ నైట్’ (Ladies Night) వేడుకలు ఘనంగా జరిగాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు, కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదభరితమైన వేడుకలతో సాయంత్రం అంతా ఉత్సాహంగా గడిచింది. కార్యక్రమానికి హాజరైన వారంతా వివిధ కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొంటూ వేడుకలను ఆనందంగా ఆస్వాదించారు.

ఈ వేడుకను ప్రత్యేకంగా నిలిపేందుకు నిర్వాహకులు పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సభ్యుల మధ్య స్నేహబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. దీంతో పాల్గొన్నవారికి ఈ వేడుక మంచి అనుభూతిని అందించింది.

కార్యక్రమ విజయానికి పలువురు స్పాన్సర్లు తమ వంతు సహకారం అందించారు. నవసర టీ నిర్వాహకులు వెజ్, నాన్‌వెజ్ స్టార్టర్లతో పాటు రుచికరమైన చికెన్ బిర్యానీని అందించారు. అలాగే తావా సంస్థ తరఫున వెజ్ బిర్యానీ, నూడుల్స్, స్వీట్లను సమకూర్చారు. అతిథులు, కార్యక్రమంలో విజేతల కోసం నవరస, తావా, మార్కెట్ కేప్ సంస్థలు గిఫ్ట్ కార్డులను స్పాన్సర్ చేశాయి. ఆహార ఏర్పాట్లు, బహుమతులతో స్పాన్సర్లు అందించిన సహకారం వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

తెలుగు కమ్యూనిటీ కార్యక్రమాలకు దాతలు, స్పాన్సర్లు నిరంతరం అందిస్తున్న మద్దతు అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. కమ్యూనిటీ అభివృద్ధి, సభ్యుల మధ్య ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలకు వారు అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో విలువైనదని తెలిపారు. ఇలాంటి సహకారం వల్లే మరిన్ని మంచి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెరవెనుక కష్టపడిన వాలంటీర్లు, ఉత్సాహంగా పాల్గొన్న సభ్యులు, కార్యవర్గ (EC) సభ్యుల సేవలను GRTA ప్రత్యేకంగా ప్రశంసించింది. ప్రతి ఒక్కరి సమష్టి కృషి వల్లే ‘లేడీస్ నైట్’ వేడుకలు విజయవంతమయ్యాయని పేర్కొంది. ఈ సందర్భంగా GRTA 2026 అధ్యక్షులు జయపాల్ కాసర్లతో పాటు టీమ్ GRTA 2026 తరఫున కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లు, వాలంటీర్లు, సభ్యులు, EC బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, వారి మధ్య సాంస్కృతిక అనుబంధాలను బలోపేతం చేయడంలో GRTA నిర్వహిస్తున్న కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘లేడీస్ నైట్’ వేడుకలు కూడా అదే స్ఫూర్తితో విజయవంతంగా ముగిశాయి.

Tags

Be the first to react

Latest