ఆకాశం లోనే ఎయిర్ ఇండియా హైజాక్ సంకేతం.. జైపూర్ లో విమానం అత్యవసర లాండింగ్!
Air india Hijack Alert: విమాన ప్రయాణంలో హైజాక్ ముప్పును సూచించే సంకేతం రావడంతో ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఏఐ-2030 విమానం నుంచి గాల్లో ఉండగానే స్క్వాక్ 7500 కోడ్ అందడంతో విమానయాన, భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని రాజస్థాన్లోని జైపూర్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
- ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా ఏఐ-2030 విమానానికి హైజాక్ హెచ్చరిక కలకలం రేపింది.
- విమానంలో మొత్తం 306 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
Air india Hijack Alert: విమాన ప్రయాణంలో హైజాక్ ముప్పును సూచించే సంకేతం రావడంతో ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఏఐ-2030 విమానం నుంచి గాల్లో ఉండగానే స్క్వాక్ 7500 కోడ్ అందడంతో విమానయాన, భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని రాజస్థాన్లోని జైపూర్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఏటీసీకి 7500 కోడ్.. అప్రమత్తమైన అధికారులు
వివరాల ప్రకారం.. 306 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-2030 విమానం ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ప్రయాణం కొనసాగుతున్న సమయంలో అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కు స్క్వాక్ 7500 కోడ్ అందినట్లు సమాచారం. విమానయాన రంగంలో ఈ కోడ్ను సాధారణంగా హైజాక్ పరిస్థితిని సూచించేందుకు ఉపయోగిస్తారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని సమీక్షించారు.
ఢిల్లీకి బదులుగా జైపూర్లో ల్యాండింగ్
హైజాక్ హెచ్చరిక నేపథ్యంలో ఎలాంటి ప్రమాదానికీ తావివ్వకుండా విమానాన్ని ఢిల్లీకి బదులుగా జైపూర్ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన అనంతరం ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులందరినీ విమానం నుంచి కిందకు దించి, భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
ప్రయాణికులను గమ్యస్థానాలకు తరలింపు
విమానంలో అనుమానాస్పద వస్తువులు లేదా ఇతర భద్రతాపరమైన ముప్పులు ఉన్నాయా అనే కోణంలో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల ప్రయాణానికి అంతరాయం కలగకుండా మరో ప్రత్యేక విమానం ద్వారా వారిని గమ్యస్థానాలకు తరలించినట్లు సమాచారం.
Tags
Be the first to react