Manas Sarovar Pilgrims: కైలాస్ మానస సరోవర యాత్ర.. నేపాల్ లో నేచిక్కుకుపోయిన  52 మంది భారతీయులు! కేంద్రం కీలక సూచనలు!

Manas Sarovar Pilgrims: కైలాస్ మానస సరోవర యాత్రకు వెళ్లే భారతీయులకు కేంద్ర విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా యాత్ర ప్రారంభించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

Manas Sarovar Pilgrims
Manas Sarovar Pilgrims

అనుమతులు, వీసాలు లేకుండా ప్రయాణాలు చేయొద్దని విదేశాంగ శాఖ హెచ్చరిక.. 

కైలాస్ యాత్రికులకు కేంద్ర సూచనలు.. పత్రాలు లేకుంటే ఇబ్బందులు తప్పవు..

న్యూఢిల్లీ: కైలాస్ మానస సరోవర యాత్రకు వెళ్లే భారతీయులకు కేంద్ర విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా యాత్ర ప్రారంభించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా కైలాస్ మానస సరోవర యాత్ర చేపడుతున్న కొంతమంది భారతీయులు అవసరమైన అనుమతులు, చైనా ప్రవేశ వీసాలు లేకుండా ప్రయాణించి నేపాల్లో చిక్కుకున్న ఘటనలపై విదేశాంగ శాఖ స్పందించింది.

ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసిన విదేశాంగ శాఖ.. పూర్తి ప్రయాణానికి అవసరమైన అన్ని పత్రాలు అందుకున్న తర్వాతే భారత్ నుంచి యాత్ర ప్రారంభించాలని సూచించింది. సరైన డాక్యుమెంట్లు నిర్ధారించుకోకుండా లేదా తర్వాత వస్తాయనే ఆశతో ముందుకు సాగితే మధ్యలో చిక్కుకునే ప్రమాదం ఉందని పేర్కొంది.

యాత్రికులు తమ టూర్ ఆపరేటర్ చట్టబద్ధంగా రిజిస్టర్ అయి, అధికారిక అనుమతులు కలిగి ఉన్నారా లేదా అనే విషయాన్ని ముందుగానే పరిశీలించాలని కూడా సూచించింది.

ప్రస్తుతం కైలాస్ మానస సరోవర యాత్రకు వెళ్లిన సుమారు 52 మంది భారతీయులు నేపాల్ రాజధాని ఖాట్మండులో చిక్కుకుపోయినట్లు సమాచారం. వారు సురక్షితంగా ముందుకు వెళ్లేందుకు అత్యవసర సహాయం కోరుతున్నారు.

ఈ విషయం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే దృష్టికి రావడంతో ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని, భారత రాయబార కార్యాలయాలను జోక్యం చేసుకోవాలని కోరారు.

ఎక్స్ (X) వేదికగా స్పందించిన సుప్రియా సూలే.. ఖాట్మండులో చిక్కుకున్న 52 మంది భారతీయ యాత్రికులకు తక్షణ సహాయం అందించాలని విదేశాంగ మంత్రి, నేపాల్లోని భారత రాయబార కార్యాలయం, చైనాలోని భారత రాయబార కార్యాలయాన్ని కోరారు. యాత్రికుల సురక్షితమైన ప్రయాణం కోసం సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా, కైలాస్ మానస సరోవర యాత్ర-2026లో భాగంగా తొలి బృందం జూన్ 20న నాథులా పాస్ మార్గం ద్వారా భారత్-చైనా సరిహద్దు దాటి చైనాలోకి ప్రవేశించింది. కైలాస్ మానస సరోవర యాత్ర అత్యంత క్లిష్టమైన అంతర్జాతీయ ఆధ్యాత్మిక ప్రయాణం కావడంతో, యాత్రికులు ముందస్తు అనుమతులు, వీసాలు, ఇతర ప్రయాణ పత్రాలను పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే ప్రయాణం ప్రారంభించాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags

Be the first to react

Latest