Train Time Changed: అనంతపురం మీదుగా వెళ్లే 4 రైళ్ల షెడ్యూల్ మార్పు.. జనవరి 1 నుంచి అమలు!

2025-12-31 10:24:00
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే తొలి విమానం ల్యాండింగ్!

అనంతపురం మీదుగా ప్రయాణించే పలు రైళ్ల సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ కొత్త టైమ్‌టేబుల్ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. వందేభారత్, కొండవీడు ఎక్స్‌ప్రెస్ సహా పలు ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్ రైళ్లకు ఈ మార్పులు వర్తిస్తాయి. ప్రయాణికులు పాత సమయాలను నమ్మకుండా కొత్త షెడ్యూల్‌ను గమనించాలని అధికారులు సూచించారు.

Gold Rates: భారీగా పడిపోయిన బంగారం ధరలు! ఈరోజు ఎంతంటే?

యశ్వంతపూర్ – మచిలీపట్నం మధ్య నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్ (17212) అనంతపురం చేరుకునే సమయం ముందుకు మార్చారు. గతంలో ఈ రైలు సాయంత్రం 6.38 గంటలకు స్టేషన్‌కు వచ్చేది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు సాయంత్రం 4.28 గంటలకే అనంతపురం చేరుకుని, 4.30 గంటలకు మచిలీపట్నం వైపు బయలుదేరుతుంది.

AP Schools: ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు కొత్త రూల్! 1 నుంచి 10 తరగతి వరకు... తప్పనిసరి!

బెంగళూరు – కలబురిగి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (22232) కూడా ముందుగానే చేరుకుంటుంది. ఈ రైలు గతంలో సాయంత్రం 5.58 గంటలకు అనంతపురం వచ్చేది. ఇకపై సాయంత్రం 5.33 గంటలకు చేరుకుని, రెండు నిమిషాల తర్వాత 5.35 గంటలకు కలబురిగి వైపు ప్రయాణం కొనసాగిస్తుంది. అలాగే బెంగళూరు – ఢిల్లీ రైలు (12627) అనంతపురం నుంచి రాత్రి 11.30కి బదులుగా 11.15 గంటలకే బయలుదేరుతుంది.

SSC స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్‌లో కీలక మలుపు…! స్కిల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల!

కొన్ని ప్యాసింజర్ రైళ్ల సమయాల్లో కూడా మార్పులు చేశారు. తిరుపతి – కదిరి దేవరపల్లి రైలు (57405) ఉదయం 6.30కి బదులుగా 6.00 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి – గుంతకల్లు రైలు (57403) మధ్యాహ్నం 12.50కి బదులుగా 1.50 గంటలకు బయలుదేరనుంది. గుంతకల్లు నుంచి తిరుపతికి వెళ్లే రైలు (57404) ఉదయం 9.15కి బదులుగా 9.00 గంటలకు అనంతపురం నుంచి బయలుదేరుతుంది.

Scrub Typhus: ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్! రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు!

అదే విధంగా కొన్ని రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. ధర్మవరం – మచిలీపట్నం రైలు (17216) సాయంత్రం 5.55కి బదులుగా 6.20 గంటలకు బయలుదేరుతుంది. బెంగళూరు – భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) కూడా సాయంత్రం 6.15కి బదులుగా 6.30 గంటలకు అనంతపురం నుంచి బయలుదేరనుంది. ఈ మార్పుల నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Penugonda Renamed: ఆర్యవైశ్యుల కోరిక నెరవేర్చిన ప్రభుత్వం! పెనుగొండకు కొత్త పేరు!
Revenue Office: కశింకోట రెవెన్యూ కార్యాలయంలో భారీ అవకతవకలు…! 21 మంది అధికారులకు షాక్!
AI: అందరికీ AI… ప్రభుత్వం సరికొత్త మాస్టర్ ప్లాన్!
ఏపీ విమానయాన రంగంలో మరో మైలురాయి.. ట్రయల్ ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి రానున్న కేంద్ర మంత్రి!
సంక్రాంతి సరదా.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు! రైల్వే ట్రాక్‌ల వద్ద గాలిపటాలు ఎగురవేస్తే ముప్పే! రివార్డుల ప్రకటన..

Spotlight

Read More →