ఆర్యవైశ్య సమాజం ఎంతో కాలంగా కోరుకుంటూ వచ్చిన ఒక ముఖ్యమైన అభ్యర్థనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పెనుగొండ మండలానికి “వాసవి పెనుగొండ” అనే పేరు మారుస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేయడం పట్ల ఆర్యవైశ్యులందరిలో ఆనందం వెల్లివిరుస్తోంది.
సమాజ భావోద్వేగాలను అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్యవైశ్యుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సమాజాల అభివృద్ధికి ఆయన చూపుతున్న దూరదృష్టి ప్రశంసనీయం అని ఆర్య వైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అన్నారు
అలాగే ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజల భావాలను గౌరవిస్తూ, సామాజిక సమానత్వాన్ని బలోపేతం చేసేలా ఆయన అందిస్తున్న సహకారం అభినందనీయం.
ఈ మార్పు సాధ్యమయ్యేలా కీలక పాత్ర పోషించిన ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. యువ నాయకుడిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించడం ఆయన నాయకత్వానికి నిదర్శనం.