⚡ BREAKING

ఇంట్లో ఈ సౌండ్ పెట్టె ఉంటే చాలు! థియేటర్ లో సినిమా వేస్ట్! తక్కువ బడ్జెట్!

Noise HomeStage Soundbars: ఇంట్లో సినిమా చూసే అనుభూతిని మరింత మెరుగుపరుచుకోవాలనుకునే వారికి నాయిస్ (Noise) కొత్త ఆడియో ఉత్పత్తులను తీసుకొచ్చింది. స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌ల విభాగంలో ఇప్పటికే గుర్తింపు పొందిన ఈ సంస్థ.. తాజాగా హోమ్ ఆడియో మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా ‘HomeStage’ పేరుతో నాలుగు కొత్త సౌండ్‌బార్ మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. విభిన్న గదుల పరిమాణాలు, వినియోగ అవసరాలు, బడ్జెట్‌లకు అనుగుణంగా వీటిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

Noise Homestage soundbars
Noise Homestage soundbars
  • Noise HomeStage పేరుతో నాలుగు కొత్త సౌండ్‌బార్ మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది.
  • సినిమాలు, మ్యూజిక్, వార్తల కోసం ప్రత్యేక EQ మోడ్‌లను అందించారు.

Noise HomeStage Soundbars: ఇంట్లో సినిమా చూసే అనుభూతిని మరింత మెరుగుపరుచుకోవాలనుకునే వారికి నాయిస్ (Noise) కొత్త ఆడియో ఉత్పత్తులను తీసుకొచ్చింది. స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌ల విభాగంలో ఇప్పటికే గుర్తింపు పొందిన ఈ సంస్థ.. తాజాగా హోమ్ ఆడియో మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా ‘HomeStage’ పేరుతో నాలుగు కొత్త సౌండ్‌బార్ మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. విభిన్న గదుల పరిమాణాలు, వినియోగ అవసరాలు, బడ్జెట్‌లకు అనుగుణంగా వీటిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

700W పీక్ అవుట్‌పుట్‌తో టాప్ మోడల్

ఈ సిరీస్‌లో అత్యంత ప్రీమియం మోడల్ HomeStage 5.2.4. ఇది ఏకంగా 700W పీక్ అవుట్‌పుట్ అందిస్తుంది. రియల్ డాల్బీ అట్మాస్, నాలుగు హైట్ ఛానెల్స్‌తో 3D ఆడియో అనుభూతిని అందించేలా దీన్ని రూపొందించారు. ఇందులో రెండు 6.5 అంగుళాల వైర్డ్ సబ్‌ వూఫర్లు, వైర్‌లెస్ రియర్ శాటిలైట్లు ఉన్నాయి.

టచ్ కంట్రోల్స్‌తో పాటు బేస్, ట్రెబుల్‌ను అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకునే సదుపాయం కూడా ఉంది. దీంతో సినిమాలు, సంగీతం వంటి కంటెంట్‌ను మరింత ఇమర్సివ్‌గా వినే అవకాశం లభిస్తుంది.

చిన్న గదుల నుంచి పెద్ద గదుల వరకు..

తక్కువ బడ్జెట్‌లో సౌండ్‌బార్ కొనాలనుకునే వారికి HomeStage 2.1 మోడల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది 90W అవుట్‌పుట్ తో చిన్న గదులకు సరిపోయేలా రూపొందించారు.

ఇక HomeStage 3.2 మోడల్ 200W అవుట్‌పుట్ అందిస్తుంది. పెద్ద ఆడియో సెటప్ కోరుకునే వారికి HomeStage 5.1 మరో ఆప్షన్. ఇది 500W అవుట్‌పుట్‌తో పాటు వైర్‌లెస్ రియర్ శాటిలైట్లను కలిగి ఉంటుంది.

కనెక్టివిటీకి కొదవ లేదు

నాయిస్ HomeStage సిరీస్‌లో పలు కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. Bluetooth 5.3, HDMI ARC, ఆప్టికల్, USB, AUX కనెక్షన్లను అందించారు. టీవీతో కనెక్ట్ చేసుకోవడంతో పాటు స్మార్ట్‌ఫోన్ నుంచి నేరుగా మ్యూజిక్‌ను కూడా ప్లే చేసుకోవచ్చు.

అంతేకాకుండా సినిమాలు, సంగీతం, వార్తలు వంటి విభిన్న కంటెంట్‌కు అనుగుణంగా ఆడియోను మార్చుకునేందుకు కస్టమ్ EQ మోడ్‌లు అందించారు.

ధరలు ఇవే..

భారత్‌లో నాయిస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ సౌండ్‌బార్‌ల విక్రయాలు ప్రారంభమయ్యాయి.

  • HomeStage 2.1 – రూ.4,999
  • HomeStage 3.2 – రూ.8,999
  • HomeStage 5.1 – రూ.14,999
  • HomeStage 5.2.4 – రూ.24,999

చిన్న గదికి సరిపోయే బేసిక్ సౌండ్‌బార్ నుంచి డాల్బీ అట్మాస్, వైర్‌లెస్ రియర్ శాటిలైట్లతో కూడిన హోమ్ థియేటర్ తరహా సెటప్ వరకు.. వివిధ అవసరాలకు అనుగుణంగా నాలుగు మోడళ్లను ఎంచుకునే అవకాశం ఉంది.

Tags

Be the first to react

Latest