ప్రపంచంలో రవాణా వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళ్లే భారీ ప్రాజెక్ట్‌పై ఇంజినీర్లు పని చేస్తున్నారు. ఫ్లైట్ ప్రయాణం కన్నా వేగంగా, రెండు ఖండాలను కలిపేలా సముద్రం కింద హై స్పీడ్ రైల్వే లైన్‌ను నిర్మించే ఆలోచన ఇది. వందల కిలోమీటర్ల పొడవున్న ఈ అండర్‌సీ టన్నెల్‌లో రైళ్లు గంటకు 250–300 కి.మీ. వేగంతో ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా చేస్తే దేశాలు, ఖండాల మధ్య ప్రయాణ సమయం కేవలం కొన్ని గంటలకు తగ్గిపోతుంది.
ఈ మెగా ప్రాజెక్ట్ పూర్తయితే, ప్రపంచంలోనే అతి పొడవైన అండర్‌సీ హై-స్పీడ్ రైలు మార్గం అవుతుంది. ప్రస్తుతం యుకే–ఫ్రాన్స్ మధ్య ఉన్న ఛానెల్ టన్నెల్ కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే. కానీ కొత్త ప్రాజెక్ట్ దానికంటే ఎన్నో రెట్లు పొడవుగా, మరింత లోతులో ఉంటుంది. ఇంత పెద్ద టన్నెల్‌ను సముద్రం లోపల నిర్మించడం సాంకేతిక పరంగా పెద్ద సవాల్ అయినప్పటికీ, ప్రయాణికులకు ఖండాల మధ్య ఎంతో సులభమైన కనెక్టివిటీ అందించగలదు.
ఈ అండర్‌సీ రైలు లింక్ ఏర్పడితే, ప్రధాన ఓడరేవులు నేరుగా రైలు మార్గాలతో కలుస్తాయి. దీనివల్ల ట్రేడ్ రూట్స్ సులభమవుతాయి, బిజినెస్ ట్రావెల్ వేగవంతమవుతుంది, షార్ట్ హాల్ అంతర్జాతీయ ఫ్లైట్లు కూడా అవసరం తగ్గిపోతాయి. ప్రభుత్వాలు ఈ ప్రాజెక్ట్‌ను కేవలం రవాణా మార్గంగానే కాకుండా, రెండు ప్రాంతాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను బలపర్చే కనెక్షన్‌గా కూడా చూస్తున్నాయి.
సొరంగం నిర్మాణం కోసం ‘డీప్ సీ టన్నెలింగ్’ అనే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇది సముద్రం అడుగున ఉన్న కఠిన రాతి పొరలని భారీ టన్నెల్ బోరింగ్ మెషీన్లతో తవ్వి రెండు పొడవైన సొరంగాలను తయారు చేస్తుంది. తీరానికి సమీప ప్రాంతాల్లో పెద్ద కాంక్రీట్ టన్నెల్ భాగాలను ముందుగా తయారు చేసి, వాటిని నీటిలోకి దించి, అక్కడ ఫిట్ చేసి కుడుచడానికి ప్రత్యేక సిస్టమ్‌ను ఉపయోగిస్తారు. దీంతో బలమైన, లీకేజీ లేని టన్నెల్ ఏర్పడుతుంది.
అయితే ఈ ప్రాజెక్ట్‌కు తీవ్రమైన సాంకేతిక సవాళ్లు ఉన్నాయి. సముద్రం లోతు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నీటి పీడనం చాలా ఎక్కువగా ఉంటుంది. స్టీల్, కాంక్రీట్ తుప్పు పట్టకుండా రక్షించాలి. భూకంపాలు, సముద్ర జీవ వ్యవస్థల రక్షణ, వెంటిలేషన్, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు అన్నీ కచ్చితమైన ప్రణాళికతో చేయాలి. ప్రతి కొన్ని వందల మీటర్లకు భద్రతా మార్గాలు, గాలి ప్రవాహం కోసం షాఫ్ట్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ అన్ని వ్యవస్థల మధ్య ప్రయాణికులకు సురక్షితమైన హై స్పీడ్ ప్రయాణాన్ని అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.