WhatsApp Update: గ్రూప్ చాట్స్‌లో కన్ఫ్యూజన్‌కు చెక్…! కొత్త ప్రొఫైల్ ఐకాన్!

2025-12-28 19:12:00
Defence News: జలాంతర్గామిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చారిత్రక ప్రయాణం... నౌకాదళానికి గర్వకారణమైన ఘట్టం!!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే ప్రముఖ ఇన్‌స్టంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ముఖ్యంగా గ్రూప్ చాట్స్‌లో ఎదురయ్యే ఒక కీలక సమస్యకు పరిష్కారంగా ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది. చాలా వాట్సప్ గ్రూపుల్లో ఒకే పేరు ఉన్న సభ్యులు ఎక్కువగా ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఎవరు మెస్సేజ్ పంపారో గుర్తించడం కష్టంగా మారుతుంది. ముఖ్యంగా ప్రొఫైల్ ఫొటో లేకపోతే గందరగోళం మరింత పెరుగుతుంది. పెద్ద గ్రూపుల్లో వందల మంది సభ్యులు ఉన్నప్పుడు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సప్ కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది.

Araku: వుడెన్ బ్రిడ్జ్ వద్ద టైమ్‌ రిస్ట్రిక్షన్స్…! అరకు టూర్‌కు కొత్త నిబంధనలు!

ఈ కొత్త ఫీచర్‌కు ‘ప్రొఫైల్ ఐకాన్ ఫీచర్’గా పేరును పెట్టింది. ఈ ఫీచర్ అమల్లోకి వస్తే, వాట్సప్ గ్రూపుల్లో ప్రతి యూజర్ ప్రొఫైల్ పక్కన ఒక ప్రత్యేక ఐకాన్ కనిపిస్తుంది. దీని ద్వారా మెస్సేజ్ పంపిన వ్యక్తిని ఒక్క చూపులోనే గుర్తించవచ్చు. పేర్లు ఒకేలా ఉన్నా, ఐకాన్ ద్వారా వారి గుర్తింపు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు, ప్రొఫైల్ ఐకాన్‌తో పాటు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడే చూపించనుంది. దీంతో గ్రూప్ చాటింగ్ సమయంలో కన్ఫ్యూజన్ పూర్తిగా తగ్గే అవకాశం ఉంది.

Bangladeshi politics: ఎన్నికల అస్త్రంగా యాంటీ ఇండియా… బంగ్లా రాజకీయాల కొత్త ట్రెండ్!

ముఖ్యంగా ప్రొఫైల్ ఫొటో లేని యూజర్లకు డిఫాల్ట్ ఐకాన్‌ను వాట్సప్ కేటాయించనుంది. దీని వల్ల ఫొటో లేకపోయినా ప్రతి యూజర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. గ్రూప్ అడ్మిన్లు, సభ్యులు అందరూ సులువుగా పార్టిసిపెంట్స్‌ను గుర్తించగలుగుతారు. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సప్ బీటా వెర్షన్ 2.23.12.7లో అందుబాటులో ఉంది. టెస్టింగ్ దశలో భాగంగా పరిమిత యూజర్లకే ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ దశలో బగ్స్‌ను గుర్తించి, వాటిని పరిష్కరించే పనిలో వాట్సప్ టీమ్ బిజీగా ఉంది.

Sajjanar: డ్రంక్ అండ్ డ్రైవ్‌కు నో ఛాన్స్… పలుకుబడి చూపితే కఠిన చర్యలు... సజ్జనార్!

బీటా టెస్టింగ్ పూర్తయిన తర్వాత యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని, అవసరమైన మార్పులు చేసిన అనంతరం ఈ ఫీచర్‌ను అధికారికంగా లాంచ్ చేయనుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ ఒకే సమయంలో ఈ ఫీచర్‌ను రోల్ అవుట్ చేయాలని వాట్సప్ ప్లాన్ చేస్తోంది. ఇకపోతే, వాట్సప్ ఇటీవల యూజర్ల అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు వరుసగా కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. వీడియో కాల్స్, వాయిస్ నోట్స్‌లో మార్పులు, కొత్త ఎమోజీలు వంటి అప్‌డేట్స్‌ను ఇప్పటికే విడుదల చేసింది. ఇతర మెస్సేజింగ్ యాప్స్‌కు పోటీగా యూజర్లను ఆకట్టుకునేలా వాట్సప్ తన ప్లాట్‌ఫామ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ముందుకెళ్తోంది.

Women Controversy: శివాజీ వివాదంలో కేఏ పాల్ ఎంట్రీ..!
Prabhas humility: సీనియర్స్ తర్వాతే మేము.. ప్రభాస్ వినయానికి ఫిదా అయిన అభిమానులు!
AP Railway Projects: హిందూపురం ప్రజలకు అదిరిపోయే గిఫ్ట్.. ఏపీలో మరో 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చనున్న కేంద్రం!
VitaminC: చర్మ ఆరోగ్యంపై కీలక పరిశోధన…! విటమిన్ సి పాత్ర ఏంటంటే!
7 మంది కలిసి వెళ్లొచ్చు.. రూ.5.76 లక్షల నుంచే స్టార్ట్.. లగ్జరీ లుక్‌లో - మధ్యతరగతికి ఇండియాలో బెస్ట్ కార్లు
AP IAS Promotions: ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు కీలక పదోన్నతులు..! ప్రభుత్వ కార్యదర్శి హోదా!

Spotlight

Read More →