హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన ఆర్థిక అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ ఈ పిటిషన్‌ను వేశారు. హెచ్‌సీఏలో చోటుచేసుకున్న అవకతవకలపై పలు అంశాలను ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు.
అంతేగాక, హెచ్‌సీఏ నిర్వహణ బాధ్యతలను బీసీసీఐకు అప్పగించేలా ఆదేశించాల్సిందిగా కోర్టును కోరారు. ఈ నెల 19న నిర్వహించిన వార్షిక సమావేశాన్ని చెల్లదు అని ప్రకటించాలని కూడా పిటిషనర్ విజ్ఞప్తి చేశాడు.
ఇప్పటికే హెచ్‌సీఏలో అక్రమాలపై ఆరోపణలతో విచారణ కొనసాగుతోంది. కీలక పదవుల్లో ఉన్న కొందరి అరెస్టుల నేపథ్యంలో, అసోసియేషన్ బాధ్యతలను విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావుకు అప్పగిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తదుపరి మూడు వారాల పాటు అమలులో ఉండనున్నాయి.