థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన చతుచక్ మార్కెట్ సమీపంలోని ఓర్ టు కో మార్కెట్‌లోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణలేని కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దాడిలో నలుగురు సెక్యూరిటీ సిబ్బంది, ఓ మహిళ మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనతో పట్టణవ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొంది. కాల్పుల ఘటనపై స్పందించిన అధికారులు—స్థానికులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత కొంత కాలంగా బ్యాంకాక్‌లో ఇలాంటి దాడులు పెరుగుతున్నట్టు సమాచారం. కేవలం రెండు నెలల క్రితమే థాంగ్ జిల్లాలోని ఓ పాఠశాల వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా మరిచిపోలేదు.