Agriculture News: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Amaravati Bill: అమరావతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారిక గెజిట్ విడుదల! Praja Vedika: నేడు (07/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: ఇక ట్రాఫిక్ టెన్షన్ గుడ్‌బై! హైదరాబాద్–వైజాగ్ కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే... కేవలం 2 గంటల్లోనే! Amaravati Capital: అమరావతే ఆంధ్రుల రాజధాని... కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల! Praja Vedika: అదృశ్యమవుతున్న భూములు.. తెరవెనుక అసలు సూత్రధారులు ఎవరు? గ్రీవెన్స్‌లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amrit Bharat Station Scheme: అమృత్ భారత్ పథకంలో పిఠాపురం.. కార్పొరేట్ లుక్‌లో మెరిసిపోనున్న స్టేషన్! Agriculture News: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Amaravati Bill: అమరావతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారిక గెజిట్ విడుదల! Praja Vedika: నేడు (07/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: ఇక ట్రాఫిక్ టెన్షన్ గుడ్‌బై! హైదరాబాద్–వైజాగ్ కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే... కేవలం 2 గంటల్లోనే! Amaravati Capital: అమరావతే ఆంధ్రుల రాజధాని... కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల! Praja Vedika: అదృశ్యమవుతున్న భూములు.. తెరవెనుక అసలు సూత్రధారులు ఎవరు? గ్రీవెన్స్‌లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amrit Bharat Station Scheme: అమృత్ భారత్ పథకంలో పిఠాపురం.. కార్పొరేట్ లుక్‌లో మెరిసిపోనున్న స్టేషన్!

YCP Shock: పోలీసులపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు.. కేసు నమోదు.! వైసీపీ కి దిమ్మతిరిగే షాక్..

YCP Shock: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నానిపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారిని బెదిరించారని, ఓ అధికారిని బాడీ షేమింగ్ చేస్తూ దూషించారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు న‌మోదు చేశారు.

Published : 2026-04-03 11:45:00
  • Politics: "చట్టం తన పని తాను చేసుకుపోతుంది": పేర్ని నానిపై కేసు నమోదు చేసిన కృష్ణా జిల్లా పోలీసులు..
     
  • "మా ప్రభుత్వం వచ్చాక ఎవరినీ వదల బొమ్మ": పోలీసులపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు.. కేసు నమోదు..

YCP Shock: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గురువారం మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, చిలకలపూడి సీఐ పరమేశ్వరరావును ఉద్దేశించి వ్యక్తిగత దూషణలకు దిగారని, ఆయన రూపాన్ని కించపరిచేలా 'బాడీ షేమింగ్' వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులను బెదిరిస్తూ, భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమని, అందరి అంతు చూస్తామని హెచ్చరించడంపై పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించింది.

ఈ ఘటనపై కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విధి నిర్వహణలో ఉన్న అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పోలీసులను అగౌరవపరచడం మరియు వారి విధులకు ఆటంకం కలిగించడం చట్టరీత్యా నేరమని పేర్కొంటూ సంఘం ప్రతినిధులు చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు పాల్పడటం మరియు వ్యక్తిగత దూషణలు చేయడం వంటి సెక్షన్ల కింద మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Spotlight

Read More →