Konatala Ramakrishna: రాజధాని శ్మశానం కాదు.. రైతుల త్యాగాల పురిటిగడ్డ.. వైసీపీ వ్యాఖ్యలపై కొణతాల ఆగ్రహం.! Daggubati Purandeswari: తక్కువ ఛార్జీలతో.. రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. స్పెషల్ ట్రైన్ ఇక శాశ్వత సర్వీసు! Narayana: రాజధానిపై గత పాలకుల కుట్రలను బట్టబయలు చేసిన మంత్రి.. వైసీపీ విషప్రచారానికి కాలం చెల్లింది.. Nara Lokesh: అసెంబ్లీలో అమరావతిపై చారిత్రాత్మక చర్చ: జగన్ మాత్రం బెంగళూరు పారిపోయారు! లోకేశ్ హాట్ కామెంట్స్.. Amaravati Capital: జగన్ నిర్ణయాలను ఎండగట్టిన షర్మిల.. అమరావతి తీర్మానం ప్రభుత్వ విజన్‌కు నిదర్శనం! Amaravathi: ఇక మార్పుల్లేవు.. అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం- సీఎం చంద్రబాబు! Middle East Conflict: భారత్ దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్.. అర్జెంటీనాతో మోదీ 'మాస్టర్ ప్లాన్'! Praja Vedika: నేడు (28/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Kharif Season 2026: ఖరీఫ్ సీజన్‌కు లైన్ క్లియర్.. ఎరువుల కొరతపై కేంద్రం కీలక ప్రకటన.!! Digital Health Portal: విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్... డిజిటల్ హెల్త్ పోర్టల్ ప్రారంభం! Konatala Ramakrishna: రాజధాని శ్మశానం కాదు.. రైతుల త్యాగాల పురిటిగడ్డ.. వైసీపీ వ్యాఖ్యలపై కొణతాల ఆగ్రహం.! Daggubati Purandeswari: తక్కువ ఛార్జీలతో.. రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. స్పెషల్ ట్రైన్ ఇక శాశ్వత సర్వీసు! Narayana: రాజధానిపై గత పాలకుల కుట్రలను బట్టబయలు చేసిన మంత్రి.. వైసీపీ విషప్రచారానికి కాలం చెల్లింది.. Nara Lokesh: అసెంబ్లీలో అమరావతిపై చారిత్రాత్మక చర్చ: జగన్ మాత్రం బెంగళూరు పారిపోయారు! లోకేశ్ హాట్ కామెంట్స్.. Amaravati Capital: జగన్ నిర్ణయాలను ఎండగట్టిన షర్మిల.. అమరావతి తీర్మానం ప్రభుత్వ విజన్‌కు నిదర్శనం! Amaravathi: ఇక మార్పుల్లేవు.. అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం- సీఎం చంద్రబాబు! Middle East Conflict: భారత్ దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్.. అర్జెంటీనాతో మోదీ 'మాస్టర్ ప్లాన్'! Praja Vedika: నేడు (28/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Kharif Season 2026: ఖరీఫ్ సీజన్‌కు లైన్ క్లియర్.. ఎరువుల కొరతపై కేంద్రం కీలక ప్రకటన.!! Digital Health Portal: విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్... డిజిటల్ హెల్త్ పోర్టల్ ప్రారంభం!

Amaravathi: ఇక మార్పుల్లేవు.. అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం- సీఎం చంద్రబాబు!

Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సహాయం కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఏప్రిల్ మొదటి వారంలోనే పార్లమెంట్‌లో ఈ బిల్లు వచ్చే అవకాశం ఉండటంతో, అమరావతికి ఇకపై ఎలాంటి రాజకీయ అడ్డంకులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఒక మైలురాయి వంటి నిర్ణయం.

Published : 2026-03-28 12:38:00

ఆంధ్రుల కలల రాజధానికి ఢిల్లీ బాట - కేంద్ర కేబినెట్ ఆమోదమే తరువాయి…

రాజధాని ఒక పవిత్ర యజ్ఞం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు….

అమరావతి బలోపేతం - కేంద్రం చేతికి ఏపీ భవిష్యత్తు బిల్లు…

Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు శాసనసభలో ఒక కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ, దానికి కేంద్రం పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించాలని ఈ తీర్మానం ద్వారా కోరారు. గతంలో ఎదురైన న్యాయపరమైన, రాజకీయపరమైన ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వ చట్టం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనపై స్పష్టతనిచ్చారు. అమరావతి రాజధాని బిల్లు ఈరోజే కేంద్రానికి చేరుతుందని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిపై చర్చ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేస్తుందని, ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఇది ఐదున్నర కోట్ల ఆంధ్రుల కల సాకారమయ్యే దిశగా పడుతున్న అతిపెద్ద అడుగు అని ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా భావోద్వేగంగా ప్రసంగించారు. రాజధాని నిర్మాణం అనేది ఒక పవిత్ర యజ్ఞమని, ఇందులో భాగస్వాములయ్యే అవకాశం సభలోని సభ్యులందరికీ లభించిందని అన్నారు. 2014లో విభజన కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యతను ప్రజలు చంద్రబాబుకు అప్పగించారని, అప్పుడే రాజధాని సంకల్పం జరిగిందని గుర్తు చేశారు. అయితే మధ్యలో వచ్చిన అడ్డంకులు రాష్ట్ర ప్రగతిని దెబ్బతీశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ రాజధాని వంటి కీలక నిర్ణయాలు మార్చడం రాష్ట్ర భవిష్యత్తుకు క్షేమకరం కాదని స్పీకర్ స్పష్టం చేశారు. ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆకాంక్షల మేరకు అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రగతి రథానికి ఇకపై ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకూడదని, అమరావతి నిర్మాణం నిరాటంకంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు.

Spotlight

Read More →