LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP Politics: పదవి కోసం సొంత చెల్లిని, తల్లిని కూడా వదలలేదు జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు..!

AP Politics: వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి కోసం జగన్ తన తండ్రి మరణాన్ని వాడుకున్నారని, సొంత తల్లిని, చెల్లిని బయటకు పంపేసిన వ్యక్తి అని ఆరోపించారు. బొత్స గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ జగన్‌పై అచ్చెన్న చేసిన విమర్శలు

AndhraPravasi News Desk 2 min read
AP Politics: పదవి కోసం సొంత చెల్లిని, తల్లిని కూడా వదలలేదు జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు..!

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై అప్పట్లోనే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయని, ఆ మరణం వెనుక జగన్ హస్తం ఉందంటూ నాడు బొత్స సత్యనారాయణే స్వయంగా అన్నారని గుర్తు చేశారు. పదవి కోసం జగన్ ఎంతటి దారుణానికైనా ఒడిగడతారని, సొంత తండ్రి మరణాన్ని కూడా సానుభూతిగా మార్చుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

తండ్రి మరణించినప్పుడు జగన్ ఎక్కడ ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. వైఎస్ ఆచూకీ తెలియక రాష్ట్రమంతా ఆందోళనలో ఉన్న సమయంలో, కనీసం మరణం నిర్ధారణ కాకముందే జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించడం చూస్తుంటే ఆయనకు పదవిపై ఉన్న వ్యామోహం అర్థమవుతోందని విమర్శించారు. అధికారం కోసం ఆరాటపడటమే తప్ప, తండ్రిని కోల్పోయిన బాధ ఆయనలో ఎక్కడా కనిపించలేదని అచ్చెన్న ఎద్దేవా చేశారు.

జగన్ రాజకీయ ప్రస్థానం అంతా అబద్ధాలు, విధ్వంసంతోనే సాగిందని మంత్రి ఆరోపించారు. 'ఒక్క అవకాశం' అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారని, సొంత కుటుంబ సభ్యులను కూడా కేవలం పదవి కోసం వాడుకుని వదిలేయడం జగన్ నైజమని విమర్శించారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎవరినీ లెక్కచేయని మనస్తత్వం ఆయనదని అన్నారు.

ముఖ్యంగా జగన్ తన సొంత చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ పట్ల ప్రవర్తించిన తీరుపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి పార్టీని బతికించిందని, తీరా అధికారం వచ్చాక ఆమెకు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఇంటి నుంచి బయటకు పంపేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. తల్లికి కూడా న్యాయం చేయని వ్యక్తి, రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తారని  ప్రశ్నించారు.

వైఎస్సార్సీపీ నాయకులు తిరుమల పేరు ఎత్తే అర్హత కూడా కోల్పోయారని అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులకు భక్తులకు క్షమాపణలు చెప్పి, లెంపలేసుకుంటేనే వారు పవిత్ర పుణ్యక్షేత్రాల గురించి మాట్లాడాలని సూచించారు. మళ్లీ కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్న జగన్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఆయనకు తగిన బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…