⚡ BREAKING
Bigg Boss10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టే ఆ 10 మంది కంటెస్టెంట్స్ వీళ్లేనా..?  •  వైసీపీ నేతల భూ ఆక్రమణ యత్నంపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! వాటర్ ట్యాంక్‌కు స్థలమిస్తే.. 21 ఏళ్లుగా సాగులో..  •  RBI issue offices: మీ ద‌గ్గ‌ర ఇంకా ఆ నోట్లు ఉన్నాయా? ఆర్బీఐ కీలక ప్రకటన.. బ్యాంకింగ్ వ్యవస్థలోకి.!  •  Buddha Venkanna: కొడాలి నానీ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్.. పిచ్చిగా వాగితే తీవ్ర పరిణామాలు.. బుద్దా వెంకన్న మైండ్ బ్లోయింగ్ కౌంటర్!  • 
Breaking

Buddha Venkanna: కొడాలి నానీ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్.. పిచ్చిగా వాగితే తీవ్ర పరిణామాలు.. బుద్దా వెంకన్న మైండ్ బ్లోయింగ్ కౌంటర్!

Buddha Venkanna: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. కొడాలి నానిపై, వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "చంద్రబాబు రాజకీయ భిక్ష పెడితేనే కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యాడు.

కొడాలి నానీ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్..
కొడాలి నానీ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్..
  • చట్టాలను హేళన చేసిన కొడాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..

  • చంద్రబాబు భిక్ష పెడితే కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యాడన్న వెంకన్న..

Buddha Venkanna: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. కొడాలి నానితో పాటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెడితేనే కొడాలి నాని తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడనే నిజాన్ని మరిచిపోకూడదని, అలాంటి వ్యక్తి ఈరోజు హనుమంతుడి ముందే కుప్పిగంతులు వేసినట్లుగా అనుచిత వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని ఆయన ధ్వజమెత్తారు. హిందూ దేవతామూర్తులను అత్యంత నీచంగా కించపరిచి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను అసభ్య పదజాలంతో తిట్టిన దేశద్రోహి జోసెఫ్ రావణ్కు వైఎస్సార్సీపీ పూర్తిగా వత్తాసు పలుకుతోందని బుద్దా వెంకన్న బహిరంగంగా ఆరోపించారు. 

వివాదాస్పద వ్యక్తి జోసెఫ్ రావణ్ వైఎస్సార్సీపీ మనిషేనని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ బాగా తెలుసని, అందుకే ఆ క్రిమినల్కు మద్దతుగా వైఎస్ జగన్ స్వయంగా ఎక్స్ వేదికగా రక్షణ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టిన రావణ్పై ఏపీ పోలీసులు చట్టప్రకారం 'ఉపా' (UAPA) చట్టం కింద కఠిన కేసు పెడితే, కొడాలి నాని దాన్ని బాధ్యతారాహిత్యంగా 'ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం' అంటూ జోకులు వేస్తూ అవమానించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దేశ రక్షణ మరియు అంతర్గత భద్రత కోసం ఉన్న అత్యున్నత చట్టాలను హేళన చేసిన కొడాలి నానిపై ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గత సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలు సుమారు రెండేళ్ల పాటు ఎక్కడా అడ్రస్ లేకుండా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లారని, ఇప్పుడు మళ్లీ రాజకీయ లబ్ధి కోసం నాగుపాముల్లా బుసలు కొట్టాలని చూస్తున్నారంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నానికి ఇదే తమ ఆఖరి హెచ్చరిక అని, ఇకపై కూటమి ప్రభుత్వంపై గానీ, ముఖ్యమంత్రిపై గానీ పిచ్చిపిచ్చిగా వాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోరంగా ఓడిపోవడానికి కొడాలి నాని లాంటి వాళ్ల బూతుల సంస్కృతే ప్రధాన కారణమని వారి సొంత పార్టీ నేతలే అంతర్గతంగా ఒప్పుకున్నారని గుర్తుచేశారు.

అధికారంలో ఉంటే విర్రవీగడం, ప్రజలు ఓడించగానే భయపడి పుట్టల్లో దాక్కోవడం వైఎస్సార్సీపీ నేతలకు అలవాటుగా మారిందని, ఇలాంటి విషనాగులను వైఎస్ జగన్ పాలు పోసి పెంచుతున్నారని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తమపై ఎన్నో అక్రమ కేసులు పెట్టి వేధించినా తాము ఎక్కడా దాక్కోలేదని, ధైర్యంగా నిలబడి జగన్ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపించామని బుద్దా వెంకన్న గుర్తుచేశారు. రెండేళ్లు అడ్రస్ లేకుండా పోయి ఇప్పుడు హఠాత్తుగా వచ్చి మీడియా ముందు అబద్ధాలు మాట్లాడుతున్న కొడాలి నానికి అంతగా దమ్ముంటే, తమతో బహిరంగ చర్చకు రావాలంటూ బుద్దా వెంకన్న ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

Tags

Be the first to react

Latest