⚡ BREAKING
Bigg Boss10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టే ఆ 10 మంది కంటెస్టెంట్స్ వీళ్లేనా..?  •  వైసీపీ నేతల భూ ఆక్రమణ యత్నంపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! వాటర్ ట్యాంక్‌కు స్థలమిస్తే.. 21 ఏళ్లుగా సాగులో..  •  RBI issue offices: మీ ద‌గ్గ‌ర ఇంకా ఆ నోట్లు ఉన్నాయా? ఆర్బీఐ కీలక ప్రకటన.. బ్యాంకింగ్ వ్యవస్థలోకి.!  •  Buddha Venkanna: కొడాలి నానీ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్.. పిచ్చిగా వాగితే తీవ్ర పరిణామాలు.. బుద్దా వెంకన్న మైండ్ బ్లోయింగ్ కౌంటర్!  • 
Breaking

వైసీపీ నేతల భూ ఆక్రమణ యత్నంపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! వాటర్ ట్యాంక్‌కు స్థలమిస్తే.. 21 ఏళ్లుగా సాగులో..

వైసీపీ నేతల భూ ఆక్రమణ యత్నంపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు!
వైసీపీ నేతల భూ ఆక్రమణ యత్నంపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు!
  • అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు..

  • సరిహద్దు రాళ్లు పీకేసి భూమి కబ్జా.. ఎదురు తిరిగితే చంపుతామంటూ బెదిరింపులు..

నంద్యాల జిల్లా మూలసాగరం గ్రామానికి చెందిన నాగార్జున నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ గ్రామంలో సర్వే నంబర్లు 635/4, 637/5, 639/4 లలో తమకి 1.95 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని కొందరు ప్రత్యర్థులు వైసీపీ నాయకులు అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ, ఈ భూమిని దేవాదాయ శాఖ పరిధిలోకి చేర్చి రక్షణ కల్పించాల్సిందిగా గతంలో ఉన్నతాధికారులను ఆశ్రయించాం. ఈ భూమికి సంబంధించి ఎన్ఓసి ఇచ్చే ప్రక్రియలో భాగంగా, ఇది 'పి.కె.ఆర్ ఇనామ్' భూమి అవునా కాదా అనే అంశంపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్,  రెవెన్యూ శాఖల మధ్య సంప్రదింపులు జరిగాయి. ఆలయ రికార్డులు, పాత రిజిస్టర్ల ప్రకారం ఆధారాలు ఉన్నప్పటికీ... సదరు విచారణాధికారి ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, తప్పుడు నివేదిక ఇచ్చారు. రికార్డులను పక్కనబెట్టి అక్రమార్కులకు లబ్ధి చేకూర్చేలా ఈ నివేదికను తయారు చేశారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు,సెర్ప్, ఎన్నారై సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి అశోక్ బాబులకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.

పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం బలుసుపాడు గ్రామానికి చెందిన మురహరిరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో తమకి తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన స్థలం ఉంది. ఆ స్థలంలో కొంత భాగాన్ని గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం ఇచ్చాం. వాటర్ ట్యాంక్ పోను మిగిలిన ఖాళీ స్థలం తమ ఆధీనంలోనే ఉండేది. అయితే, ఇదే గ్రామానికి చెందిన మందడపు రామకోటయ్య, మందడపు నరసింహారావు వారి కుటుంబ సభ్యులు కలిసి తన స్థలంలో ఉన్న సరిహద్దులను పగలగొట్టారు. అంతేకాకుండా, వాటర్ ట్యాంక్ పక్కనే ఉన్న తన మిగతా ఖాళీ స్థలాన్ని కూడా బలవంతంగా ఆక్రమించుకుని చుట్టూ గోడ కట్టేశారు. ఈ అక్రమ నిర్మాణంపై, భూ ఆక్రమణపై నిలదీయడానికి వెళ్లిన తనని సదరు వ్యక్తులు తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామానికి చెందిన చాగంటి కుమారి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తనకు పసుపుగల్లు గ్రామం సర్వే నెం. 318/7 లో య.1-00 భూమి ఉంది. 2005లో ప్రభుత్వ పంపిణీ చేసిన డి.కె.టి పట్టా కింద మంజూరైన ఈ భూమిని గత 21 సంవత్సరాలుగా తమ కుటుంబం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆన్లైన్ రెవెన్యూ రికార్డులలో కూడా స్పష్టంగా తన పేరే నమోదై ఉంది. అయితే, పక్క పొలానికి చెందిన బిజ్జం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి ఈ భూమితో ఎలాంటి హక్కులు లేకపోయినప్పటికీ, దౌర్జన్యంగా భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఈ క్రమంలో తనను, తన తల్లిదండ్రులను సదరు వ్యక్తి కొట్టడానికి వచ్చి తీవ్రమైన బెదిరింపులకు దిగాడు. దీనిపై స్థానిక ముండ్లమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. పోలీసుల విజ్ఞప్తి మేరకు ముండ్లమూరు తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, విలేజ్ రెవెన్యూ అధికారితో క్షేత్రస్థాయి విచారణ జరిపించారు. ఈ విచారణలో సదరు ఒక ఎకరం భూమి పూర్తిగా తన స్వాధీనంలోనే ఉందని, రికార్డుల ప్రకారం అది తమదేనని, బిజ్జం శ్రీనివాసరెడ్డికి ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. ఈ మేరకు ముండ్లమూరు తహశీల్దార్ గారు ది.25-06-2026 తేదీన (ఆర్.సి.నెం.బి/133/2026 రుగా) ముండ్లమూరు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి అధికారిక నివేదికను కూడా పంపారు. తహశీల్దార్ నివేదిక వచ్చినప్పటికీ, సదరు బిజ్జం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ఉత్తర్వులను కానీ, చట్టాన్ని కానీ లెక్కచేయకుండా, పొలంలోకి వస్తే రౌడీలతో చంపేస్తానని దౌర్జన్యం చేస్తున్నాడు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు.

శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం దొన్నికోట గ్రామానికి చెందిన ఉతప్ప గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామ పరిధిలో తనకు 3.18 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. అయితే, ఇదే ప్రాంతానికి చెందిన బీరే వెంకటయ్య, బీరే రాము, బీరే రమణయ్య అనే ముగ్గురు వ్యక్తులు కలిసి దౌర్జన్యానికి దిగారు. తనకి చెందిన 3.18 సెంట్ల భూమి యొక్క సరిహద్దు రాళ్లను, గుర్తులను అక్రమంగా పీకివేసి, ఆ భూమిని పూర్తిగా కబ్జా చేశారు. తమ భూమిని తమకు వదిలిపెట్టాలని కోరినందుకు తనని బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈ భూకబ్జా, దౌర్జన్యంపై స్థానిక తహశీల్దార్ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కళ్లముందే భూమిని అక్రమంగా లాక్కుంటున్నా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు.  కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామానికి చెందిన తమ్మినీడి దొరయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..ఇద్దరి పేర్ల మీద నమోదై ఉన్న భూమిని తమ్మినీడి అబ్బులు చౌదరి బలవంతంగా ఆక్రమించుకున్నాడు. అంతేకాకుండా, దమ్మ సత్యనారాయణ అనే వ్యక్తికి ఆ భూమిని కౌలుకు ఇచ్చి, కౌలు డబ్బులను కూడా అబ్బులు చౌదరే తీసుకుంటున్నారు. దీనిపై ఆర్టీఐ చట్టం ద్వారా ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలను, జరిగిన మోసాన్ని రుజువు చేసే స్పష్టమైన ఆధారాలున్నాయి. ఈ అన్యాయంపై గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశాను. సమస్యను పరిష్కరించాలని ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ ఆదేశించినప్పటికీ పెనుగొండ తహశీల్దార్ స్పందించలేదు. 

మొదటి ఫిర్యాదు చేసిన 75 రోజుల వరకు "డాష్ బోర్డ్లో ఫిర్యాదు కనిపించడం లేదు" అంటూ కాలయాపన చేశారు. జూన్ 15న తహశీల్దార్ ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేస్తూ జూన్ 19న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే, నిందితుడు అబ్బులు చౌదరి విచారణకు హాజరుకాకపోయినప్పటికీ, తహశీల్దార్ తన వైపు ఉన్న ఆధారాలను పరిశీలించకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. "ఈ సమస్యను మేము పరిష్కరించలేము, మీరే బయట చూసుకోవాలని తహశీల్దార్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం వెనుక నిందితుడికి కొమ్ముకాసే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన ఐ. శివలక్ష్మీ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..భట్టిప్రోలు మండలం పెద్దపులివర్రు రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 478-2 లో తనకు భూమి ఉంది. ఈ భూమిని కొలవడానికి గత నెల 09-06-2026న డివిజనల్ సర్వేయర్ దుర్గారావు గారు క్షేత్రస్థాయి పరిశీలన చేసి కొలతలు తీసుకున్నారు. అయితే సర్వే జరిగి ఒక నెల కావస్తున్నా, ఇప్పటివరకు ఆ కొలతలకు సంబంధించిన ఎటువంటి అధికారిక సమాచారాన్ని గానీ, నివేదికను గానీ తమకి అందజేయలేదు. ఈ అర్జీ పరిష్కారానికి గడువు తేదీ 26-06-2026తో ముగిసిపోవాల్సి ఉండగా బాపట్ల జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ గారు జూన్ 25న నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లో తనకు తానే గడువును పొడిగించుకున్నారు. ఈ సమస్యపై 25-06-2026న రేపల్లెలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా రెవెన్యూ అధికారి టి. 

గంగాధర్ గౌడ్ గారిని కలిసి ఫిర్యాదు చేశాను. డీఆర్వో గారు స్పందించి బాపట్ల ఏడీ గారిని, సర్వేయర్ దుర్గారావును పిలిచి వివరణ కోరారు. ఆ సమయంలో... జూన్ 29న బాపట్ల కలెక్టరేట్లోని తన కార్యాలయానికి వస్తే నివేదిక ఇస్తానని సర్వేయర్ దుర్గారావు డీఆర్వో సమక్షంలోనే తనకి హామీ ఇచ్చారు. తీరా జూన్ 29న బాపట్ల కలెక్టరేట్ ఆఫీసుకు వెళ్లగా, "రిపోర్టు ఇంకా తయారు కాలేదు, భట్టిప్రోలు మండల సర్వేయర్ నుండి మరికొంత సమాచారం రావాల్సి ఉంది, రెండు రోజుల్లో ఫోన్ చేసి పిలుస్తాం" అని చెప్పి పంపించేశారు. కానీ నేటికీ అధికారుల నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ఒక సాధారణ మహిళనైన తనను సర్వే అధికారులు ఏడాది కాలంగా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ మానసిక వేదనకు గురిచేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఏలూరుకు చెందిన తగరం నాగేశ్వరరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. అనారోగ్య కారణాల వల్ల ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుండి మార్చి 25 వరకు చాట్రాయి మండలం చీపురుగూడెం పంచాయితీ పరిధిలోని మరిబంధం గ్రామంలో గల తన పెదనాన్న కుమారుడు తగరం సోమయ్య ఇంట్లో ఆశ్రయం పొందాను. ఆ సమయంలో ఆయన నివాసముంటున్న గదిలోనే పృధ్వీ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ క్రమంలో తనకు చెందిన రెండు విలువైన బంగారు ఉంగరాలను (ఒకటి ఎర్ర రంగు రాయి కలిగిన ఎల్.ఐ.సి ఉంగరం, మరొకటి తెల్ల రాయి పొదిగిన గుండ్రని ఉంగరం పృధ్వీ దొంగిలించాడు.  

బంగారు ఉంగరాల దొంగతనంపై 17-02-2026న చాట్రాయి పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశాను. నిందితుడి వివరాలు తెలిసినప్పటికీ స్థానిక ఎస్.ఐ గారు చర్యలు తీసుకోకపోవడంతో, అనేకమార్లు స్టేషన్ చుట్టూ తిరిగి అభ్యర్థించాను. అక్కడ ఫలితం లేకపోవడంతో నేరుగా ఏలూరు జిల్లా ఎస్పీ గారిని కలిసి గ్రీవెన్స్ సెల్ ద్వారా రెండుసార్లు దరఖాస్తులు సమర్పించాను. అయినప్పటికీ, నేటివరకు పోలీసుల నుండి ఎలాంటి పురోగతి లేదని, దొంగిలించబడిన ఉంగరాల ఆచూకీ లభించలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామానికి చెందిన వాసా సాంబశివరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..ధూపాడు గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 454-Aలో 4.09 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిపై గతంలో జిల్లా సర్వేయర్ గారు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి కొలతలు వేశారు. సర్వేయర్ కొలతల ప్రకారం సదరు భూమి సబ్-డివిజన్ల వారీగా సర్వే నెం. 454-A లో 0.99 సెంట్లు, సర్వే నెం. 454-B లో 3.08 సెంట్లు... మొత్తంగా 4.07 సెంట్లు ఉన్నట్లు అధికారికంగా తేలింది. అయితే, ఈ కొలతల ప్రకారం భూమి వివరాలను ఆన్లైన్ రికార్డులలో సరిచేసి నమోదు చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆశ్రయించాను. కానీ, క్షేత్రస్థాయి నివేదికలు స్పష్టంగా ఉన్నప్పటికీ, స్థానిక అధికారులు పాత రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకురావాలంటూ ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయకుండా తనను చుట్టూ తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.

Tags

Be the first to react

Latest