TDP: వైఎస్సార్, జగన్ పాలనలో పరిశ్రమల పేరుతో భూముల లూటీ జరిగింది.. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఘాటు వాఖ్యలు!
TDP: వైఎస్సార్, జగన్ పాలనలో పరిశ్రమలు, ఉపాధి కల్పన పేరుతో రాష్ట్రంలో భారీ స్థాయిలో భూముల దోపిడీ జరిగిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల పేరుతో ప్రజల భూములను కారుచౌకగా కట్టబెట్టి, క్విడ్ ప్రోకో రాజకీయాలకు పాల్పడ్డాయని ఆయన విమర్శించారు.
క్విడ్ ప్రోకోతో కోట్ల రూపాయలు దండుకున్నారు: జగన్పై పట్టాభిరామ్ విమర్శలు..
ఓబులాపురం గనుల నుంచి బ్రాహ్మణి స్టీల్స్ వరకు అక్రమాలే: పట్టాభిరామ్..
అమరావతి: వైఎస్సార్, జగన్ పాలనలో పరిశ్రమలు, ఉపాధి కల్పన పేరుతో రాష్ట్రంలో భారీ స్థాయిలో భూముల దోపిడీ జరిగిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల పేరుతో ప్రజల భూములను కారుచౌకగా కట్టబెట్టి, క్విడ్ ప్రోకో రాజకీయాలకు పాల్పడ్డాయని ఆయన విమర్శించారు.
పట్టాభిరామ్ మాట్లాడుతూ, వైఎస్సార్ హయాంలో బ్రాహ్మణి స్టీల్స్కు సుమారు 14 వేల ఎకరాల భూమిని ఎకరాకు కేవలం రూ.18,500 చొప్పున కేటాయించారని అన్నారు. ఇందులో స్టీల్ ప్లాంట్ కోసం 10,760 ఎకరాలను అత్యంత తక్కువ ధరకు అప్పగించారని పేర్కొన్నారు. ఆ భూములను రూ.350 కోట్లకు తాకట్టు పెట్టి అక్రమాలకు పాల్పడ్డారని, కానీ అక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చలేదని విమర్శించారు.
ఓబులాపురం మైనింగ్ వ్యవహారం వెనుక ఉన్నవారే బ్రాహ్మణి స్టీల్స్ ప్రతిపాదనను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ఓబులాపురం గనుల్లో భారీ అక్రమాలు జరిగాయని సీబీఐ కూడా పేర్కొన్నప్పటికీ, వాటిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తు చేశారు.
అలాగే విమానాశ్రయం పేరుతో 3,115 ఎకరాల భూమిని కూడా తక్కువ ధరకు కేటాయించారని, ఇందుకు సంబంధించిన జీవో వైఎస్సార్ ప్రభుత్వ కాలంలోనే జారీ అయ్యిందని చెప్పారు. పరిశ్రమల స్థాపన పేరుతో జగన్ ప్రభుత్వం భారీగా అక్రమాలకు పాల్పడిందని, క్విడ్ ప్రోకో ద్వారా కోట్ల రూపాయలు దండుకుందని ఆయన ఆరోపించారు.
ప్రస్తుత పరిస్థితిని ప్రస్తావిస్తూ, జగన్ లూటీకి ప్రతీక అయితే, చంద్రబాబు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలకు ప్రతీక అని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందన్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిందాల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి నాంది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని, వాటి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో ఉపాధి విప్లవాన్ని తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.
Tags
Be the first to react
